Sridevi: నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ కోర్ట్. ఈ మూవీతో కాకినాడమ్మాయి శ్రీదేవి తెలుగు చిత్ర పరిశ్రమకి హీరోయిన్‌గా పరిచయమైంది. మొదటి సినిమాతో ప్రియదర్శి, శివాజి లాంటి సీనియర్స్ తో కలిసి నటించే లక్కీ ఛాన్స్ అందుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ దగ్గర్నుంచి, సక్సెస్ మీట్స్ వరకు బాగా హైలెట్ అయింది అంటే శ్రీదేవినే.
ఈ సినిమా సమయంలో స్మాల్ స్క్రీన్ మీద కూడా బాగా ఫేమస్ అయింది. ఆ తర్వాత నుంచి శ్రీదేవి కోసం చాలామంది సినిమాలలో నటించమని ఆఫర్ చేస్తున్నారట. కానీ, మంచి ప్రాజెక్ట్ అండ్ క్లీన్ స్టోరీ అయితేనే చేస్తానని చెప్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడున్న మిడ్ రేంజ్ హీరోలకి కూడా శ్రీదేవి సూటయ్యే ఏజ్ కాదు. అప్‌కమింగ్ కుర్ర హీరోలకి సూటయ్యే క్యూట్ బ్యూటి. సోషల్ మీడియాలో మాత్రం కోలీవుడ్ లో స్టార్ హీరో పక్కన ఛాన్స్ వచ్చిందని, తెలుగులో క్రేజీ ప్రాజెక్ట్స్ కి సైన్ చేసిందని ప్రచారం అవుతోంది.
Also Read – Viral News: అలా ఎలా బ్రో..హైదరాబాద్ లో గోడపైకెక్కిన కారు..!
ఇక తాజాగా శ్రీదేవి మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించాలని ఉందనే విషయాన్ని బయటపెట్టింది. మొదట్నుంచి నేను పవన్ కళ్యాణ్ గారికి పెద్ద అభిమానిని అని తెలిపింది శ్రీదేవి. కోర్ట్ హిట్ అయ్యాక మెగాస్టార్ చిరంజీవి గారిని కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. త్వరలో పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి బ్లెసింగ్స్ తీసుకుంటానని తెలిపింది. ఖచ్చితంగా ఫ్యూచర్ లో పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటిస్తానని చెప్తుంది.
ఇండస్ట్రీలో చాలామందికి పవన్ కళ్యాణ్ గారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంటుంది. కానీ, అందరికీ ఆ అదృష్టం రాదు. వకీల్ సాబ్ మూవీలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్లకి అలాంటి లక్కీ ఛాన్స్ వచ్చింది. ఇలాంటి సినిమా గనక పవన్ కళ్యాణ్ మళ్ళి చేస్తే అందులో శ్రీదేవికి సరిపోయే రోల్ ఉంటే చెప్పలేము. కానీ, ఇప్పట్లో ఈ యంగ్ బ్యూటీ కోరిక తీరడం కష్టమే.
Also Read – 8th Pay Commission: 8వ పే కమిషన్ అమల్లోకి వస్తే.. మీ శాలరీ ఎంత పెరుగుతుందో తెలుసా?


