Amithab Bachchan : చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్స్ పేర్లని, ఫోటోలని తమ బిజినెస్ ప్రమోషన్స్ కి వాడేస్తూ ఉంటారు. లోకల్ గా ఇవి ఎక్కువగా జరుగుతుంది. ఇక బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ ని అయితే నార్త్, సౌత్ అని తేడా లేకుండా చాలా మంది వాడేస్తారు. అమితాబ్ ఫోటో, వాయిస్, పేరు పర్సనల్ గా, బిజినెస్ లకి వాడేస్తూ ఉంటారు. కొన్ని పెద్ద సంస్థలు కూడా అమితాబ్ ని ఉచితంగా వాడేస్తూ ఉంటాయి.
తాజాగా వాణిజ్యపరమైన కార్యకలాపాల్లో తన అనుమతిలేకుండా పేరు, ఫొటో, వాయిస్ ఉపయోగిస్తున్నారని, ఇలా నా అనుమతి లేకుండా నాకు సంబంధించినవి ఎవరూ వాడకుండా నిషేధం విధించాలని అమితాబ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అమితాబ్ తరపున న్యాయవాది హరీశ్ సాల్వే దీనిపై వాదనలు వినిపించారు. కొన్ని సంస్థలు అమితాబ్ ఫొటోలతో టీ-షర్టులు తయారు చేసి అమ్ముతున్నారని, కొన్ని సంస్థలు పోస్టర్లు తయారు చేస్తున్నారని, కొంతమంది అయితే ఏకంగా అమితాబ్ పై వెబ్ సైట్స్ నిర్వహిస్తున్నారంటూ కోర్టుకి తెలిపారు.
దీంతో అమితాబ్ తరపున లాయర్ వాదనలు విన్న అనంతరం ఇకపై అమితాబ్ బచ్చన్ అనుమతి లేకుండా ఆయన సెలబ్రిటీ హోదాను ఉపయోగించరాదని, ఆయన ఫొటోలు, పేరు, వాయిన్‌ను ఎవరూ ఉపయోగించకూడదని, ఒకవేళ ఉపయోగిస్తే చట్టపరంగా ఎదుర్కోవాల్సి వస్తుందని కోర్టు తెలిపింది.