Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభCrazy combo: అమీర్ ఖాన్, Jr. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్..పోలా..అదిరిపోలా

Crazy combo: అమీర్ ఖాన్, Jr. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్..పోలా..అదిరిపోలా

అమీర్ ఖాన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి స్క్రీన్ షేర్ చేస్తే ఎంత క్రేజీగా ఉంటుంది? ఇద్దరు మిస్టర్ పర్ఫెక్టులు కలిసినట్టే ఉండదూ? ఇదే ఐడియా వచ్చింది మన ప్రశాంత్ నీల్ కు. కేజీఎఫ్ తో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నెక్ట్స్ సినిమాలో అమీర్, తారక్ కలిసి యాక్ట్ చేయనున్నట్టు ఓ రూమర్ వచ్చింది. ఇదే నిజమైతే ఈ ప్యాన్ ఇండియా మూవీ క్రేజియెస్ట్ ప్రాజెక్ట్ ఎవర్ అవ్వటం ఖాయం. NTR31 సినిమాను ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అమీర్ యాక్ట్ చేస్తున్నట్టు సమాచారం. సలార్ రిలీజ్ కు రెడీ అవుతుండగా ఎన్టీఆర్ 31 తరువాత KGF Chapter 3 తీయనున్నారు ప్రశాంత్. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న అమీర్ ఖాన్ ప్రెజెంట్ గా యాక్టింగ్ నుంచి స్మాల్ బ్రేక్ తీసుకున్నారు. ఇప్పటికే సౌత్ డైరెక్టర్స్ వెంట బాలీవుడ్ బిగ్ స్టార్స్ పడ్డారు. అట్లీతో షారూఖ్ ఖాన్ వస్తుండగా ఇప్పుడు అమీర్ కూడా హిట్ కోసం సౌత్ పైన ఫోకస్ పెట్టారన్నమాట.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News