Monday, November 17, 2025
Homeచిత్ర ప్రభDevara 2: సెట్స్ పైకి వచ్చేస్తోన్న దేవర 2.. క్రేజీ అప్ డేట్

Devara 2: సెట్స్ పైకి వచ్చేస్తోన్న దేవర 2.. క్రేజీ అప్ డేట్

Devara 2: మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపులార్, దేవర లాంటి సినిమాలతో వ‌రుస స‌క్సెస్‌ల‌ను అందుకున్నారు. ప్రస్తుతం తారక్ రేంజ్ పాన్ ఇండియా వైడ్‌గా ఎస్టాబ్లిష్ కావడంతో ఆయన నుంచి వచ్చే ప్రతీ సినిమాను అంతకుమించి అన్నట్టుగానే మేకర్స్ నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్, త్వరలో వార్2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆగ‌స్ట్ 14న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఇందులో.. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ మరో హీరోగా నటించారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. తారక్ కి ఇది బాలీవుడ్‌లో ఫస్ట్ సినిమా. కాబట్టి ఈ మూవీపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -

ఒకరకంగా చెప్పాలంటే వార్ 2కి సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలి గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఇందులో నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, శ్రుతి హాసన్, సత్యరాజ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. భారీ మల్టీస్టారర్‌గా కూలి చిత్రాన్ని యాక్షన్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించారు. వరుస సక్సెస్‌లతో దూకుడు మీదున్న సూపర్ స్టార్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో కూలి చిత్రంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్టు 14, 15 తేదీలో ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ నెలకొంది.

Also Read – Coolie Pre Release Event: నాగార్జున విలన్ పాత్రపై రజినీ కామెంట్స్.. తనపై తనే సెటైర్ వేసుకున్న సూపర్ స్టార్

ఇక వార్ 2 పూర్తి చేసిన ఎన్టీఆర్, ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ సినిమా చేస్తున్నారు. పరిశీలనలో డ్రాగన్ అనే టైటిల్ ఉండగా.. ఈ మూవీ చిత్రీకరణను ఇదే ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ వరకు పూర్తి చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు గనక పూర్తైతే వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్‌ని సెట్స్‌పైకి తీసుకు వస్తారనే విషయంలో రకరకాల వార్తలు సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నాయి.

అయితే, తాజా సమాచారం మేరకు.. ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాను కొరటాల శివతో చేయబోతున్నట్టు తెలుస్తోంది. వీరి కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ దేవరకి సీక్వెల్ మూవీని ప్రారంభించబోతున్నారట. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నుంచి దేవర 2 సెట్స్‌పైకి వచ్చే అవకాశాలున్నాయి. 2027 సంక్రాంతికి పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేయడానికి కొరటాల టీమ్ ప్లాన్ చేస్తోందట. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో భారీ చిత్రాన్ని చెయనున్నారు ఎన్టీఆర్. ఒకవేళ కొరటాల సినిమా గనక సెట్స్‌పైకి రావడం ఆలస్యం అయితే, త్రివిక్రమ్-తారక్ ల సినిమా మొదలవుతుంది.

Also Read – upasana konidela: ఉపాస‌న కొణిదెల తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క బాధ్య‌త‌లు -సీఎంకు థాంక్స్ చెప్పిన మెగా కోడ‌లు…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad