Thursday, April 3, 2025
Homeచిత్ర ప్రభDaaku Maharaaj: 'డాకు మహారాజ్‌'గా బాలయ్య.. టైటిల్ టీజర్ వచ్చేసింది

Daaku Maharaaj: ‘డాకు మహారాజ్‌’గా బాలయ్య.. టైటిల్ టీజర్ వచ్చేసింది

Daaku Maharaaj| నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా, దర్శకుడు బాబీ కలయికలో కొత్త చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ను మూవీ యూనిట్ తాజాగా ప్రకటించింది. ఈ సినిమాకు ‘డాకు మహారాజ్‌’(Daaku Maharaaj) అనే పేరు ఖరారు చేస్తూ టీజర్ విడుదల చేసింది. టీజర్‌లో బాలయ్య పవర్ ఫుల్ లుక్‌లో అదరగొట్టాడు.

- Advertisement -

‘‘ఈ కథ వెలుగుని పంచే దేవుళ్లది కాదు. చీకటిని శాసించే రాక్షసులది కాదు. ఆ రాక్షసులను ఆడించే రావణుడిదీ కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది. గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మరాజుది. మరణాన్నే వణికించిన మహారాజుది’’ అనే సంభాషణలతో టీజర్‌ మొదలైంది. చివర్లో ‘‘గుర్తుపట్టావా.. డాకు మహారాజ్‌’’ అంటూ బాలయ్య చెప్పే డైలాగ్స్‌, విజువల్స్‌ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా ఉన్నాయి. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News