Monday, January 13, 2025
Homeచిత్ర ప్రభDaaku Maharaj: ‘డాకు మహారాజ్‌’ తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే..?

Daaku Maharaj: ‘డాకు మహారాజ్‌’ తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే..?

నటసింహం బాలకృష్ణ(Balakrishna) నటించిన ‘డాకు మహారాజ్‌’(Daaku Maharaaj)సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. సినిమాలో బాలయ్య డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్, థమన్ బీజీఎం గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. దీంతో మూవీ చూసేందుకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో తొలిరోజు కలెక్షన్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.56 కోట్లు వసూలు చేసినట్లు తెలిపింది. దీంతో బాలకృష్ణ కెరీర్‌లో ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘డాకు మహారాజ్‌’ నిలిచిందని పేర్కొంది. ఇక ఈనెల 17 నుంచి తమిళ, హిందీ భాషల్లో కూడా ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించింది. మూవీకి బ్లాక్‌బస్టర్ టాక్ రావడంతో ఇవాళ్టితో వంద కోట్ల క్లబ్‌లోకి చేరడం ఖాయమని అభిమానులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -

ఇదిలా ఉంటే మూవీ యూనిట్ సక్సెస్ పార్టీ నిర్వహించింది. ఈ పార్టీలో బాల‌య్య‌తో పాటు టాలీవుడ్‌ యంగ్ హీరోలు సిద్ధూ జొన్న‌ల‌గ‌డ్డ‌, విశ్వక్ సేన్ సంద‌డి చేశారు. ఈ సందర్భంగా తీసుకున్న సెల్ఫీ వీడియోను విశ్వ‌క్ సేన్ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. ఇందులో సిద్ధూ, విశ్వ‌క్ చెంప‌ల‌పై బాల‌య్య ముద్దులు పెట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News