Mrunal Thakur Poster: బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) టాలీవుడ్‌పై స్పెషల్ ఫోకస్ చేసింది. సీతారామం (Sita Ramam), హాయ్ నాన్న చిత్రాల సక్సెస్ తర్వాత ఫ్యామిలీ స్టార్ (Family Star) డిజాస్టర్ కావటం ఆమె జోరుకి బ్రేకులేసిందనే చెప్పాలి. ప్రస్తుతం ఆమె నటిస్తోన్న క్రేజీ మూవీ ‘డెకాయిట్’ (Dacoit). అడివిశేష్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి షానీ డియోల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న (Dacoit Release date) విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. ఆగస్ట్ 1న మృణాల్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఆమెకు సర్‌ప్రైజ్‌నిచ్చింది.
మృణాల్ ఠాకూర్‌కి తెలియకుండా తీసుకొచ్చిన కేక్‌తో సెట్స్‌లో సర్‌ప్రైజ్ సెలబ్రేషన్‌ను కండెక్ట్ చేసింది. ఊహించని ఈ పరిణామంతో మృణాల్ ఎంతో ఎమోషనల్‌గా రియాక్ట్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను గమనిస్తే.. ఈ సందర్భంగా చిత్రబృందం తలుపు తట్టి ‘హ్యాపీ బర్త్‌డే సరస్వతి’ అంటూ శుభాకాంక్షలు తెలుపడంతో, సినిమాలో ఆమె పాత్ర పేరు ‘సరస్వతి’ అని రివీల్ చేసింది.
మృణాల్ ఠాకూర్ పుట్టినరోజు సందర్భంగా డెకాయిట్ చిత్రం నుండి ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో మృణాల్ గన్ చేతపట్టుకొని లక్ష్యాన్ని ఎయిమ్ చేస్తూ కనిపిస్తున్నారు. ఆమె కళ్లలో కనిపిస్తున్న ఆగ్రహం, బాధ, ఇన్‌టెన్స్ ఫీలింగ్ ఆమె పాత్రలోని డెప్త్‌ను తెలియజేస్తుంది. ఇందులో జూలియెట్ అనే పాత్ర కేవలం ఒక లవ్ ట్రాక్‌కు మాత్రమే పరిమితం కాదు. ఇది పూర్తి స్థాయిలో రివెంజ్ డ్రామాకు ప్రాణం పోసే కీ క్యారెక్టర్‌గా మృణాల్ కనిపించనున్నారు. తెలుగు సినీ తెరపై ఇంతవరకూ హీరొయిన్లు పోషించిన పాత్రలతో పోల్చితే, ఈ క్యారెక్టర్ పూర్తిగా డిఫరెంట్‌గా ఉంటుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాదులో చిత్ర యూనిట్, లీడ్ యాక్టర్స్‌తో కీలక సన్నివేశాల్ని షూట్ చేస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో వస్తోన్న ఈ భారీ సినిమాను సుప్రియా యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ పోస్టర్‌తో సినిమాపై భారీ అంచనాలున్నాయి. మృణాల్ ఠాకూర్ ఇప్పటి వరకు చేసిన సినిమాలతో పోల్చితే ఈ మూవీలో యాక్షన్ తరహాలో రోల్ లో నటిస్తుంది. ముందుగా ఈ రోల్ లో శ్రుతీ హాసన్ నటించింది. కానీ కొన్ని కారణాలతో ఆమె తప్పుకుంది. ఇప్పుడామె స్థానంలో మృణాల్ ఠాకూర్ నటిస్తుంది.
Also Read – Venkatesh – Rana: కోర్టు విచారణకు దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానా – కారణం ఏమిటంటే?


