Daddy Movie Actress: మెగాస్టార్ చిరంజీవి రీసెంట్‌గానే తన 70వ పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు. మెగాస్టార్ కెరీర్‌లో ఎన్నో ఒడిదొడుకులున్నాయి. సక్సెస్‌లే కాదు.. పరాజయాలు కూడా ఆయన్ని పలకరించాయి. ఒకానొక తరుణంలో వరుస ఫ్లాప్స్‌తో ఇబ్బందిపడ్డ చిరంజీవి.. డాడీ సినిమాతో తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నారు. ఆ సినిమా కోసం ఆయన బరువు తగ్గి చాలా స్లిమ్‌గా కనిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నిర్మించింది. సిమ్రాన్ కథానాయికగా నటించిన ఇందులో చిరంజీవి ఓ పాపకు తండ్రిగా నటించారు. 2001లో మాస్టర్ ఫేమ్ సురేష్ కృష్ణ దీన్ని తెరకెక్కించారు.
సీనియర్ రైటర్ భూపతి రాజా ఈ కథను చిరంజీవి కోసమే సిద్ధం చేశారు. ఆసక్తికరమైన మరో విషయమేమంటే ఇందులో అల్లు అర్జున్ ఎంట్రీ కూడా ఉంది. రెండు, మూడు సన్నివేశాల్లో ఆయన కనిపించారు. సినిమాలోని తండ్రి, కూతురు మధ్య ఉన్న అనుబంధమే సినిమాకు ప్రధాన ఎసెట్‌గా నిలిచింది. మూవీలో చిరంజీవి కూతురుగా నటించిన అనుష్క మల్హోత్రా.. ముంబైలో ఉంటుంది. ఆమె తెలిసిన వారి ద్వారా ఇక్కడకు ఆడిషన్స్‌కు రావటం, సెలక్ట్ కావటం జరిగాయి. తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉంటోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం అడపా దడపా సందడి చేస్తోంది.
Also Read- Actor Naresh New Home : 5 ఎకరాల్లో ఇంద్రభవనంలాంటి ఇల్లు కట్టిన నరేష్.. వీడియో వైరల్
తాజాగా అనుష్క మల్హోత్రా తన ఇన్‌స్టాగ్రామ్‌లో జిమ్ చేసిన పిక్స్‌ను పోస్ట్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమా విడుదలై అప్పుడే 24 ఏళ్లు అవుతోంది. ఇందులో అనుష్క మల్హోత్రా డబుల్ రోల్ చేసింది. ఎంతో ప్రేమగా పెంచిన తండ్రి నుంచి అనుకోని పరిస్థితుల్లో పాప విడిపోతుంది. తల్లి దగ్గరే పెరుగుతుంది. కొన్నేళ్లకు మళ్లీ తండ్రిని కలుసుకునే కమ్రంలో ఏం జరిగిందనే కథాంశంతో సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాతో చిరంజీవి మళ్లీ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా ఆయన ట్రాన్స్‌ఫార్మేషన్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అక్కడి నుంచి వరుస సక్సెస్‌లను సొంతం చేసుకుంటూ వచ్చారు చిరంజీవి. ఈ సినిమాకు రాజ్‌కుమార్ ఎస్.ఎ అందించిన సంగీతం ప్లస్ అయ్యింది. మరో ఇంట్రెస్టింగ్ విషయమేమంటే.. ఇందులో రెండు ఫైట్స్‌ను పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కంపోజ్ చేశారు.
https://www.instagram.com/p/DNj5uc1suwB/
చిరంజీవి, సిమ్రాన్ జంటగా నటించిన ఈ చిత్రంలో ఆషిమా భల్లా సెకండ్ హీరోయిన్‌గా కనిపించింది. శరత్ బాబు, రాజేంద్ర ప్రసాద్, రాజా రవీంద్ర, కోట శ్రీనివాసరావు, అచ్యుత్ తదితరులు ఇతర పాత్రల్లో అలరించారు.
Also Read- Rajamouli Movie Updates: SSMB29 కోసం అడవుల బాట పట్టిన మహేష్.. జక్కన్న


