Venkatesh – Rana: టాలీవుడ్‌లో దగ్గుబాటి ఫ్యామిలీని అజాత శత్రువుగా పేర్కొంటుంటారు. సినిమాలతో తప్ప వివాదాల కారణంగా వీరు వార్తల్లో నిలవడం చాలా అరుదు. తాజాగా ఓ వివాదం కారణంగా దగ్గుబాటి హీరోలు కోర్టు మెట్లు ఎక్కబోతున్నారు. హీరోలు వెంకటేష్, రానా, నిర్మాత సురేష్‌బాబుతో పాటు అభిరామ్ కోర్టు విచారణకు హాజరుకాబోతున్నారు.
దక్కన్ కిచెన్ వివాదం…
ఫిలిం నగర్‌లో దక్కన్ కిచెన్ స్థలానికి సంబంధించి నందకుమార్ అనే వ్యక్తితో దగ్గుబాటి కుటుంబానికి చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయి. తన హోటల్‌ను దగ్గుబాటి కుటుంబసభ్యులు అక్రమంగా కూల్చివేశారంటూ 2024లో నందకుమార్ కోర్టుకు వెళ్లాడు. ఈ వివాదంపై దగ్గుబాటి ఫ్యామిలీపై ఫిలిం నగర్ పోలీసులు 448, 452, 458, 120 బీ సెక్షన్ల కింద కేసును నమోదు చేసినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలని సురేష్‌బాబుతో పాటు వెంకటేష్, రానా, అభిరామ్‌లకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Also Read – Facial Recognition : కంత్రిగాళ్ల పని ఖతం.. కంట పడ్డారో మీపని గోవిందా!
కోర్టు ఆదేశాలు ధిక్కరణ…
కోర్టు ఆదేశాలను ధిక్కరించిన దగ్గుబాటి హీరోలు ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదట. షూటింగ్‌లు చేస్తూ కాలయాపన చేస్తున్నారంటూ వీరిపై కోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆగస్ట్ 1న తప్పకుండా విచారణకు హాజరు కావాల్సిందేనని వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఈ వివాదం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దగ్గుబాటి ఫ్యామిలీ హీరోలు కోర్టుకు హాజరు అవుతారా ? లేదా? ఆసక్తిని రేకెత్తిస్తోంది.
వెంకటేష్ మాత్రమే…
ప్రస్తుతం దగ్గుబాటి హీరోల్లో వెంకటేష్ మాత్రమే గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో పెద్ద హిట్ అందుకున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 300 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న మెగా157 మూవీలో గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నాడు వెంకటేష్. అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు.
ప్రొడ్యూసర్‌గా…
హీరో రోల్స్‌కు దూరంగా ఉంటున్న రానా… తెలుగు, తమిళం, హిందీ భాషల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. కాంత, పరాశక్తితో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తున్నాడు. కాంత సినిమాను స్వయంగా రానానే ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
Also Read – Viral Video: వీడెవడండీ బాబు.. ఏకంగా కొండ చిలువనే బైక్‌కు కట్టి..!


