Sunday, October 6, 2024
Homeచిత్ర ప్రభDhamaka Movie : దండ క‌డియాల్ లిరిక‌ల్‌ .. మాస్ స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టిన ర‌వితేజ‌

Dhamaka Movie : దండ క‌డియాల్ లిరిక‌ల్‌ .. మాస్ స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టిన ర‌వితేజ‌

Dhamaka Movie : మాస్ మ‌హారాజా ర‌వితేజ, శ్రీ లీల జంట‌గా న‌టిస్తున్న చిత్రం ‘ధ‌మాకా’. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్ప‌టికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. ఇక ఈ చిత్రం డిసెంబ‌ర్ 23న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ఇప్ప‌టికే ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలను మొద‌లుపెట్టింది.

- Advertisement -

టీజ‌ర్‌తో పాటు మూడు పాట‌ల‌ను విడుద‌ల చేసింది. తాజాగా నాలుగో లిరిక‌ల్ పాట‌ను విడుద‌ల చేసింది చిత్ర‌బృందం. ‘దండ క‌డియాల్’ అంటూ పుల్ మాస్ బీట్‌తో ఈ పాట సాగుతోంది. ర‌వితేజ‌, శ్రీ లీల వేసిన డ్యాన్స్ మాస్ ఆడియ‌న్స్‌తో విజిల్స్ వేయించే రేంజ్‌లో ఉన్నాయి. ప్ర‌స్తుతం ఈ పాట యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. భీమ్స్ సెసిరోలియో లిరిక్స్ రాయ‌డంతో పాటు సాహితి చాగంటి, మంగ్లీల‌తో క‌లిసి పాడారు.

‘ఖ‌లాడీ’, ‘రామారావు ఆన్‌డ్యూటీ’ చిత్రాలు ప్రేక్ష‌కులు ఆశించిన స్థాయిలో అల‌రించ‌లేక‌పోయాయి. దీంతో ‘ధ‌మాకా’ చిత్రంపై ర‌వితేజ భారీ ఆశ‌లే పెట్టుకున్నాడు. నెల‌రోజుల ముందు నుంచే ఈ చిత్రాన్ని ప్ర‌మోట్ చేసే ప‌నిలో ర‌వితేజ పుల్ బిజీగా ఉన్నాడు. మ‌రీ మాస్ మ‌హారాజాకు ఈ చిత్రం ఎటువంటి అనుభూతిని మిగులుస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News