Friday, November 22, 2024
Homeచిత్ర ప్రభDarling: ట్రీట్మెంట్ కోసం ఫారిన్ కెళ్లిన ప్రభాస్

Darling: ట్రీట్మెంట్ కోసం ఫారిన్ కెళ్లిన ప్రభాస్

సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే.. ఇలా చాలా భారీ-ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో భాగమైన డార్లింగ్ ప్రభాస్ ఆరోగ్యం ఈమధ్య ఏమంత బాగుండట్లేదని సమాచారం. సిక్ గా ఉన్న ప్రభాస్ హై టెంపరేచర్ తో బాధపడుతుండగా డాక్టర్ కాస్త బ్రేక్ తీసుకుని రెస్ట్ తీసుకోమని సలహా ఇచ్చారట. దీంతో ప్రస్తుతం తన షూటింగ్ పనులనుంచి ప్రభాస్ బ్రేక్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు చికిత్స కోసం ఆయన ఫారిన్ వెళ్లినట్టు సమాచారం. ఇంతకీ ఎప్పుడు ఫారిన్ నుంచి వచ్చి, షూటింగ్ కంటిన్యూ చేస్తారన్నదానిపై మాత్రం క్లారిటీ లేదు.

- Advertisement -

ఇక గత కొంతకాలంగా బ్రేక్ లేకుండా ఆయన పనిచేస్తూనే ఉన్నారు. దీంతో ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నట్టు సమాచారం. ఇక ఇటు సినిమాల విషయానికి వస్తే ప్రాజెక్ట్ కే షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆది పురుష్ షూటింగ్ పూర్తైనా సీజీ వర్క్ కోసం పెండింగ్ లో ఉంటూ జనవరి 12న రిలీజ్ కు బదులు జూన్ 16న రిలీజ్ అవుతోంది. ఇక ప్రభాస్ ఆరోగ్యంపై ఆయన ఫ్యాన్స్ గందరగోళంలో గత కొన్నేళ్లుగా ఉన్నారు. బాహుబలి తరువాత ప్రభాస్ ఫిట్నెస్ దారుణంగా దెబ్బతిని, ఆయన నడవటం కూడా కష్టంగా మారిందనే రూమర్లు, క్లిప్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే.

పర్సనల్ విషయానికి వస్తే ప్రభాస్ పెళ్లి విషయంపై కూడా రూమర్లు వస్తున్నాయి కానీ ఆయన ఎటూ తేల్చటం లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News