Sunday, October 6, 2024
Homeచిత్ర ప్రభDasara: 75 లక్షల గోల్డ్ కాయిన్స్ పంచిన హీరోయిన్!

Dasara: 75 లక్షల గోల్డ్ కాయిన్స్ పంచిన హీరోయిన్!

కీర్తి సురేశ్ హిట్స్ కోసం, పెద్ద సినిమాల కోసం చాలా ఓపికగా వెయిట్ చేస్తున్నారు. అదేంటో ఆమె బాలీవుడ్ కు వెళ్లి రిజెక్ట్ అయి (మైదాన్ కోసం ముంబైలో మకాం వేసి వచ్చేశారు) మళ్లీ సౌత్ కు వచ్చాక ఆమెలో విపరీతమైన మార్పు వచ్చింది.  అంతేకాదు ఎప్పుడూ ఏదో ఒక రూమర్ ఆమె చుట్టూ తిరుగుతోంది.  మొత్తానికి ఇలా రెగ్యులర్ గా న్యూస్ లో ఉంటోంది కీర్తి బ్యూటీ.  అప్పుడెప్పుడో మ్యూజిక్ డైరెక్టర్ తో లవ్, అఫైర్, మ్యారేజ్ అని మళ్లీ ఇంకో హీరో అని.. ఆతరువాత బిజినెస్ మ్యాన్ అని.. లేదు ఇంట్లో ఇంకా వెతుకుతున్నారని ఇలా ఆమె పెళ్లి రూమర్స్ ఓవైపు వస్తూనే ఉంటున్నాయి.

- Advertisement -

మరోవైపు ఆమె నానీతో కలిసి దసరా సినిమా పూర్తి చేసి, ఈ ప్యాన్ ఇండియా రిజల్ట్ కోసం వేయి కళ్లతో ఆశగా ఎదురుచూస్తున్నారు. 130 గ్రాముల గోల్డ్ కాయిన్స్ ను ఈ సినిమా క్రూకు కీర్తి పంచినట్టు ఓ వార్త షికారు చేస్తోంది.  దీని విలువ 75 లక్షల పైమాటే.  దసరా సినిమా షూటింగ్ లాస్ట్ రోజు ఈమె ఇలా గోల్డెన్ గిఫ్ట్ పంచి పెట్టారట.  షూటింగ్ ప్యాకప్ చెప్పేప్పుడు ఆమె చాలా ఎమోషనల్ కూడా అయ్యారట.  దసరా సినిమా తెలుగు, తమిళ్, హిందీ, మళయాళం, కన్నడలో మార్చ్ 30న రిలీజ్ కానుంది.

తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో దసరా సినిమా సాగుతుందట. మొత్తానికి కీర్తి సురేశ్ గిఫ్ట్స్ టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా మారింది.  లేడీ సూపర్ స్టార్ నయన తార కూడా ఇలాగే సినిమా షూటింగ్ చివరి రోజు వాచ్ లు వంటివి గిఫ్ట్ ఇస్తారనే పేరుంది.  ఆమధ్య బిగ్ స్టార్స్ కొందరు గోల్డ్ చెయిన్స్ కూడా తమ బృందానికి పంచారు. ఈమధ్య హీరోలు, హీరోయిన్స్ ఇలా బంగారు వస్తువులు పంచి పెట్టడాన్ని లక్కీగా భావిస్తున్నారట అన్ని ఇండస్ట్రీస్ లోనూ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News