Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభDDLJ: వాలెంటైన్స్ డే కి మీ ఫేవరెట్ మూవీ DDLJ మళ్లీ రిలీజ్

DDLJ: వాలెంటైన్స్ డే కి మీ ఫేవరెట్ మూవీ DDLJ మళ్లీ రిలీజ్

షారూఖ్ ఖాన్, కాజోల్ నటించిన రొమాంటిక్ మూవీ ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’ మరోమారు రిలీజ్ అవుతోంది. ప్యాన్ ఇండియా మూవీగా DDLJ 37 సిటీల్లో రిలీజ్ కానుంది. ఫిబ్రవరి 10 నుంచి వారం రోజుల పాటు ఈ సినిమా రిలీజ్ అయి తన ఫ్యాన్స్ క్లబ్ ను ఆకట్టుకోనుంది. ముంబై, పూనే, అహ్మదాబాద్, సూరత్, వదోదర, గుర్గావ్, ఫరీదాబాద్, లక్నో, నోయిడా, డెహ్రాడూన్, ఢిల్లీ, చండీగఢ్, కోల్కతా, గువహటి, బెంగళూరు, హైదరాబాద్, ఇండోర్, చెన్నై, వెల్లూర్, ట్రివేండ్రంలో డీడీఎల్జే రిలీజ్ అవుతుంది.

- Advertisement -

ఈ సినిమాను ఎందుకు రీ రిలీజ్ చేయరంటూ గత కొన్నేళ్లుగా తమను చాలా మంది అడుగుతున్నందున DDLJ మళ్లీ రిలీజ్ చేస్తున్నట్టు యష్ రాజ్ ఫిలిమ్స్ వెల్లడించింది. ఈ వాలెంటైన్స్ డేకి DDLJ ఎంజాయ్ చేయచ్చని వైఆర్ఎఫ్ ప్రకటించింది. 25 ఏళ్ల తరువాత ఈ బ్లాక్ బస్టర్ మళ్లీ రిలీజ్ కానుండటం హైలైట్. పఠాన్ సినిమా రికార్డ్ స్థాయిలో హిట్ కావటంతో DDLJ కూడా షారూఖ్ ఫ్యాన్స్ కు మళ్లీ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందనే అంచనాలున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad