The Paradise: పాన్ ఇండియన్ ఇప్పుడు కామన్ అయిపోయింది. పాన్ వరల్డ్‌పై టాలీవుడ్ హీరోలు కన్నేశారు. మహేష్‌బాబు – రాజమౌళి మూవీ, అల్లు అర్జున్ – అట్లీ సినిమాలు ఇండియాతో పాటు ప్రపంచ భాషల్లో రిలీజ్ కాబోతున్నాయి. ఈ సినిమాల కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. ‘ది ప్యారడైజ్’తో నాని కూడా పాన్ వరల్డ్ లీగ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ఇంగ్లీష్, స్పానిష్ లాంగ్వేజ్‌లలో రిలీజ్ అవుతోంది.
హాలీవుడ్‌లో ది ప్యారడైజ్ ప్రమోషన్స్‌ను భారీగా నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ ప్రమోషన్స్ కోసం ఇంటర్నేషనల్ వైడ్‌గా క్రేజ్ ఉన్న హాలీవుడ్ హీరో రయాన్ రెనాల్డ్స్‌ను రంగంలోకి దించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. డెడ్‌పూల్, 6 అండర్ గ్రౌండ్, రెడ్ నోటీస్ వంటి సినిమాలతో యాక్షన్ హీరోగా అభిమానులను మెప్పించారు రయాన్ రెనాల్డ్స్. ప్యారడైజ్ ఇంగ్లీష్ వెర్షన్‌కు రయాన్ రెనాల్డ్స్ ప్రజెంటర్‌గా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. డెడ్‌పూల్ స్టార్‌ను ఇటీవలే ప్యారడైజ్ టీమ్ కలిసినట్లు సమాచారం. ప్రస్తుతం డీల్‌కు సంబంధించి డిస్కషన్స్ జరుగుతున్నాయట. ఒకవేళ ఈ డీల్ అనుకున్నట్లుగా జరిగితే రయాన్‌కు ఉన్న క్రేజ్ వల్ల ప్యారడైజ్ మూవీ హాలీవుడ్‌లోనూ భారీగానే కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంటుంది.
Also Read- Tamannaah: అబద్దాలు చెబితే సహించను – విజయ్ వర్మతో బ్రేకప్‌పై తమన్నా కామెంట్స్
మరోవైపు ప్యారడైజ్ షూటింగ్ మొదలై ఆరు నెలలు దాటిపోయింది. ఇప్పటివరకు హీరోయిన్ ఎవరన్నది కన్ఫామ్ కాలేదు. ఈ యాక్షన్ మూవీలో నానితో రొమాన్స్ చేసే హీరోయిన్ ఎవరన్నది తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తికరంగా మారింది. తాజాగా హీరోయిన్‌ను మేకర్స్ కన్ఫామ్ చేసినట్లు సమాచారం. డ్రాగన్ ఫేమ్ కయదు లోహర్ ప్యారడైజ్‌లో నాని సరసన నటించనున్నది. డిసెంబర్ నెలలో ప్యారడైజ్ మూవీలో కయదు లోహర్ జాయిన్ కానున్నట్లు సమాచారం.
ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్‌తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన కయదు లోహర్ ప్రస్తుతం విశ్వక్ సేన్ ఫంకీలో హీరోయిన్‌గా నటిస్తోంది. డ్రాగన్‌లో కయదు రోల్ కూడా డిఫరెంట్‌గా ఉంటుందని అంటున్నారు.
దసరా తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. 2026 మార్చి 26న ప్యారడైజ్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Also Read- AP CM: నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక అవార్డు.. నేడు లండన్ వెళ్లనున్న సీఎం దంపతులు


