ఈరోజు ఎపిసోడ్‌లో శౌర్య రిపోర్ట్స్ చెక్ చేసి వెంటనే ఆపరేషన్ చేయాలి తొందరగా డబ్బు ఏర్పాటు చేసుకోండి అంటాడు. కార్తిక్ సరే ఈరోజే జాయిన్ చేస్తాను అంటాడు. ఇంటికి వచ్చి బట్టలు సర్ది, డబ్బులు తీసుకుని శౌర్యని దింపడానికి వెళ్తుంటే దీప మాత్రం శౌర్యని పంపించడానికి ఒప్పుకోదు. నేను కుడా వస్తాను అంటే కార్తిక్ వద్దు అని చెప్పేస్తాడు. మరి డబ్బు ఎందుకు తీసుకెళ్తున్నారు అంటే దారిలో ఫ్రెండ్‌కి ఇవ్వాలి అంటాడు. శౌర్య నా కూతురు దానికి ఏమి చేసినా మంచే చేస్తాను అంటాడు. శౌర్యని అమ్మకి బాయ్ చెప్పు అంటే దీప ఒప్పుకోదు శౌర్య దీపకు బాయ్ చెప్పేసి వెళ్తారు. దారిలో గుడిలో దణ్ణం పెట్టుకుందాం అనుకున్న పని జరగాలని కోరుకో అంటాడు. ఆ తర్వాత మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఉండలేను నాన్న ఇంటి దగ్గరే ఉంటాను అని శౌర్య అంటే కార్తీక్ ఎమోషనల్ అవుతాడు.
ఇంట్లో కాంచన అనసూయతో మాట్లాడుతూ కార్తీక్ స్కూల్‌లో చదువుతున్నప్పుడు ఎవరికో చేసిన సాయం కోసం చెప్తుంది. వాడు ఏమి చేసినా మంచి పనే చేస్తాడు అందుకే వాడు చేసే పనులకు నేను అడ్డు చెప్పను అంటుంది. నువ్వు అదృష్టవంతురాలివి నీ కడుపున మంచి కొడుకు పుట్టాడు అని అనసూయ అంటుంది. ఆతర్వాత కార్తిక్ శౌర్య విషయంలో చేస్తున్న విషయం గురించి మాట్లాడుకుంటారు. ఏమైందో అర్ధం కావట్లేదు అంటారు. మరోవైపు శౌర్యను తీసుకుని కార్తిక్ హాస్పిటల్‌కు వెళ్తే అక్కడ ముందే కాశీ ఉంటాడు అప్పుడు శౌర్య మేము ఇక్కడ ఉన్నామని నీకెలా తెలుసు మావయ్య అని కాశీని అంటుంది. నేనే రమ్మనాను అని కార్తిక్ అంటాడు ఆతర్వాత డబ్బు కట్టి హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారు.
నన్ను ఎందుకు హాస్పిటల్‌లో జాయిన్ చేసావు అని అడుగుతుంది. నేను నీ మాట విని నువ్వు ఏమి చెప్పినా వింటున్నాను కదా మరి చెప్పు ఎందుకు తీసుకొచ్చావు అని ప్రశ్నలు మీద ప్రశ్నలు వేస్తుంది శౌర్య. నీకు ఒంట్లో బాలేదు కదా అందుకే నువ్వు వారం రోజులపాటు హాస్పిటల్ లోనే ఉండాలి అని కార్తీక్ అంటాడు. కార్తిక్ ఏవొక మాటలు చెప్పి శౌర్యను ఒప్పిస్తాడు. నేను నిన్ను చూడటానికి రోజూ వస్తాను నేను రాకపోతే కాశీ మామయ్య వచ్చి నీ దగ్గర ఉంటాడు అని అంటాడు కార్తీక్. అమ్మకి ఏమి చెప్పకూడదు అంటాడు శౌర్య ఓకే నాన్న అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.