Friday, April 4, 2025
Homeచిత్ర ప్రభDeepika Padukone : ఈ సారి లేడీ సింగం.. సింగం ఎగైన్ అంటున్న బాలీవుడ్ స్టార్...

Deepika Padukone : ఈ సారి లేడీ సింగం.. సింగం ఎగైన్ అంటున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్..

.

- Advertisement -

Deepika Padukone : తమిళ్ లో సూర్య నటించిన సింగం సిరీస్ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సూర్య తమిళ్ లో సింగం 1,2,3 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. వీటిని తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేయగా ఇక్కడ కూడా హిట్ అయ్యాయి. కేవలం ఈ సినిమాల మెయిన్ లైన్ ని తీసుకొని బాలీవుడ్ లో కూడా తమ స్టైల్ లో సింగం, సింగం రిటర్న్స్ అనే పేరుతో రీమేక్ చేశారు.

బాలీవుడ్ కమర్షియల్ డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో అజయ్ దేవగణ్ హీరోగా సింగం, సింగం రిటర్న్స్ సినిమాలు వచ్చి మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు ఈ సినిమాకి పార్ట్ 3 ప్లాన్ చేస్తున్నాడు రోహిత్ శెట్టి. అయితే ఈ సారి సొంత కథతో లేడీ ఓరియెంటెడ్ చేయబోతున్నట్టు సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే మెయిన్ లీడ్ లో సింగం ఎగైన్ అనే టైటిల్ తో సినిమా చేయనున్నట్టు, దీపికా పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనపడబోతున్నట్టు సమాచారం.

దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీపికా పవర్ ఫుల్ పోలీసాఫీసర్ అనడంతో ఆమె అభిమానులు ఈ సినిమా అనౌన్సమెంట్ కోసం ఎదురు చూస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News