Deepika Padukone: గత కొన్నాళ్లుగా దీపికా పదుకొనెను వరుసగా వివాదాలు వెంటాడుతున్నాయి. దీపికా పదుకొనె ఏం చేసినా? ఏం మాట్లాడినా అది సెన్సేషన్ అవుతుంది. ముఖ్యంగా దీపికా పదుకొనె రోజుకు 8 గంటల వర్కింగ్ అవర్ రూల్ బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ రూల్ దీపికా పదుకొనెకు కష్టాలు తెచ్చిపెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 8 గంటల కండీషన్ వల్లే స్పిరిట్, కల్కి 2 నుంచి దీపికా పదుకొనెను మేకర్స్ పక్కనపెట్టినట్లు వార్తలొస్తున్నాయి.
ట్రోల్ చేశారు…
ఎనిమిది గంటల రూల్ విషయంలో నెటిజన్లు దీపికా పదుకొనెనే ఎక్కువగా టార్గెట్ చేశారు. ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. చివరకు ఇండస్ట్రీకి చెందిన కొంత మంది సెలిబ్రిటీలు సైతం దీపికా తీరును తప్పుబడుతూ సెటైర్స్ వేశారు. ఇన్నాళ్లు ఈ వివాదాలపై సెలైంట్‌గా ఉన్న దీపికా పదుకొనె ఎట్టకేలకు మౌనం వీడింది. ఓ బాలీవుడ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎనిమిది గంటల పని చేయాలనే రూల్‌పై సంచలన కామెంట్స్ చేసింది.
సూపర్ స్టార్స్ కూడా…
‘ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది సూపర్ స్టార్స్ రోజుకు ఎనిమిది గంటలే షూటింగ్‌లు చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇది కొనసాగుతోంది. ఇదేం సీక్రెట్ కాదు. అందరికి తెలిసిన వాస్తవమే. ఇన్నేళ్లలో ఏ రోజు ఇది హెడ్‌లైన్స్‌లో నిలవలేదు. అంతే కాకుండా ఆ స్టార్స్ సోమవారం నుంచి శుక్రవారం వరకు వారంలో ఐదు రోజులు మాత్రమే పనిచేస్తారు. వీకెండ్స్ సెలవు తీసుకుంటారు. ఆ స్టార్స్ ఎవరో అందరికి తెలుసు. వాళ్ల పేర్లు చెప్పి విషయాన్ని తప్పుదోవ పట్టించాలని నేను అనుకోవడం లేదు’ అని దీపికా పదుకొనె కామెంట్స్ చేసింది.
Also Read- SS Rajamouli Birthday: మట్టిలోంచి మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన మాంత్రికుడు!
‘కొంత మంది హీరోయిన్లతో పాటు ఇటీవల తల్లిగా మారిన నాయికలు కూడా రోజుకు ఎనిమిది గంటలే పనిచేస్తున్నారు. వాళ్లను వదిలిపెట్టి నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. పోరాటాలు నా జీవితంలో కొత్త కాదు. సమస్యలను మౌనంగా ఎదుర్కొంటూ ముందుకు సాగటం అలవర్చుకున్నా. సెలైంట్‌గా పోరాటం చేయడమే నాకు తెలుసు. అలా చేస్తేనే గౌరవంగా ఉంటుందని నమ్ముతున్నా’ అని దీపికా పదుకొనె తెలిపింది. ఆమె కామెంట్స్ బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
స్పిరిట్, కల్కి 2 సినిమాల నుంచి తప్పుకున్న దీపికా పదుకొనె ప్రస్తుతం షారుఖ్‌ఖాన్‌తో కింగ్ సినిమా చేస్తోంది. ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో కల్కి తర్వాత అల్లు అర్జున్, అట్లీ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నవంబర్‌లో ఈ సినిమా షూటింగ్‌లో దీపికా పదుకొనె జాయిన్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read- Anupama Parameswaran: విక్రమ్ కొడుకుతో డేటింగ్ – అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్ ఇదే!


