Deepika Padukone – Kalki 2 : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 ఏడీ మూవీతోనే హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది దీపికా పదుకోనె. మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్‌గా తెరకెక్కిన ఈ మూవీ 1100 కోట్లకుపైగా కలెక్షన్స్‌ను దక్కించుకున్నది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
డీ గ్లామర్ రోల్‌లో…
కల్కి మూవీలో సుమతి అనే క్యారెక్టర్‌లో దీపికా పదుకోనెకనిపించింది. కెరీర్‌లో ఇప్పటివరకు చేసిన సినిమాలకు భిన్నంగా ఈ తెలుగు మూవీలో డీ గ్లామర్ రోల్‌లో కనిపించి ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేసింది. దీపికా పదుకోనె క్యారెక్టర్ చుట్టూనే కల్కి 2898 ఏడీ కథ సాగింది. కాంప్లెక్స్ వరల్డ్ నుంచి సుమతి ఎలా తప్పించుకుంది? సుప్రీం యాశ్కిన్ మనుషుల బారి నుంచి సుమతిని అశ్వత్థామతో కలిసి భైరవ ఎలా కాపాడాడు అన్నది కల్కి పార్ట్ 1లో నాగ్ అశ్విన్ చూపించాడు. కల్కి పార్ట్ వన్ కంటే పార్ట్ 2లో దీపికా పదుకోణ్ పాత్రకు ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
వైజయంతీ మూవీస్ ట్వీట్…
కల్కి సీక్వెల్ షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చింది దీపికా పదుకోనె. కల్కి 2 నుంచి దీపికా పదుకోణ్ తప్పకున్నది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. కల్కి సీక్వెల్‌లో దీపికా పదుకోనె నటించడం లేదని తెలిపారు. చాలా ఆలోచనలు, చర్చల తర్వాతే ఈ నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందని వైజయంతీ మూవీస్ ట్వీట్ చేసింది. కల్కి 2898 ఏడీ లాంటి సినిమాను కంప్లీట్ చేయడానికి ఎంతో అంకితభావం, నిబద్ధత కావాలి. కల్కి పార్ట్ వన్ కోసం దీపికా ఎంతో కష్టపడింది. అయినా సీక్వెల్‌లో ఆమె భాగం కాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీపికా పదుకోనె భవిష్యత్తు ప్రాజెక్ట్‌లు సక్సెస్ కావాలంటూ కల్కి నిర్మాణ సంస్థ తెలిపింది. వైజయంతీ మూవీస్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీ…
డేట్ ఇష్యూస్‌తో పాటు క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగానే దీపికా పదుకోనె కల్కి 2 నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కల్కి 2 నుంచి దీపికా పదుకోనెను తప్పుకోవడంపై ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. దీపికాపదుకోనెను సినిమా నుంచి తప్పించి మంచి పని చేశారంటూ వైజయంతీ మూవీస్ ట్వీట్‌ను ఉద్దేశించి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మంచి నిర్ణయమని పేర్కొంటున్నారు. వైజయంతీ మూవీస్ ట్వీట్‌కు దీపికా పదుకోనె ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. కల్కి 2 మూవీలో దీపిక ప్లేస్‌లో ఎవరికి హీరోయిన్‌గా ఎంచుకుంటారన్నది కూడా అభిమానుల్లో క్యూరియాసిటీని కలిగిస్తోంది.
కాగా వరుసగా ప్రభాస్ సినిమాల నుంచి దీపికా పదుకోనె తప్పుకోవడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్ స్పిరిట్ మూవీలో తొలుత దీపికా పదుకోనె హీరోయిన్‌గా కన్ఫామ్ అయ్యింది. కానీ సందీప్ వంగాతో ఏర్పడిన విభేదాలతో షూటింగ్ మొదలుకాకముందే సినిమా నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు కల్కి 2 నుంచి కూడా తప్పుకున్నది.
అల్లు అర్జున్…అట్లీ మూవీలో…
కల్కి మూవీలో అమితాబ్‌బచ్చన్ కీలక పాత్ర పోషించగా కమల్‌హాసన్ విలన్‌గా నటించాడు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్‌తో పాటు రాజమౌళి, రామ్‌గోపాల్ వర్మ గెస్ట్ రోల్స్ చేశారు.
కాగా ప్రస్తుతం దీపికా పదుకోణ్…అల్లు అర్జున్, అట్లీ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. కల్కి 2898 ఏడీ తర్వాత తెలుగులో ఆమె చేస్తున్న సినిమా ఇది.
ALSO READ : https://teluguprabha.net/cinema-news/three-blockbusters-in-september-2025-at-tollywood-box-office/


