Deepika Padukone: ప్రభాస్ కల్కి 2 నుంచి దీపికా పదుకొనె తప్పుకోవడంపై సోషల్ మీడియాలో అనేక కథనాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా నుంచి దీపికా పదుకొనె తప్పుకోలేదని, సినిమా యూనిట్ ఆమెను బలవంతంగా పక్కనపెట్టారని అంటున్నారు. దీపికా పదుకొనె పెట్టిన కండీషన్ల వల్లే ఆమెను కల్కి 2 నుంచి బయటకు పంపించేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కల్కి సీక్వెల్ విషయంలో తప్పంతా దీపికాదే అంటూ ఈ బాలీవుడ్ బ్యూటీని టార్గెట్ చేస్తూ నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు. కొందరు బాలీవుడ్ క్రిటిక్స్ సైతం ఈ వాదనలో నిజం ఉందని అంటున్నారు.
ఎందుకు తప్పుకుంది…
దీపికా పదుకొనె సినిమా నుంచి ఎందుకు తప్పుకుంది అన్నది మాత్రం వైజయంతీ మూవీస్ క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఆమెలో నిబద్ధత లేదంటూ ఇన్‌డైరెక్ట్‌గా ట్వీట్ చేశారు. నాగ్ అశ్విన్ కూడా కర్మను అనుభవించాల్సిందేనని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. వారి పోస్ట్‌లతో దీపికా పదుకొనెపై ఉన్న కాస్తో కూస్తో సానుభూతి కూడా పోయింది.
Also Read- Little Hearts OTT: దసరాకు ఓటీటీలోకి లిటిల్ హార్ట్స్ – క్లారిటీ ఇచ్చిన ఓటీటీ సంస్థ
ఈ విమర్శల నేపథ్యంలో దీపికా పదుకొనె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. సినిమా ద్వారా మనం ఏం నేర్చుకున్నాం.. అందులో ఎవరితో పనిచేస్తున్నామన్నవి విజయం కంటే ముఖ్యమైనవని 18 ఏళ్ల క్రితం ఓం శాంతి ఓం సినిమా చేస్తున్నప్పుడు షారుఖ్‌ఖాన్ నాతో చెప్పారు. ఇప్పటికీ నేను ఆ మాటలనే విశ్వసిస్తున్నా. నేను తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక షారుఖ్‌ఖాన్ చెప్పిన ఆ పాఠాలనే అమలు చేస్తున్నా. అందుకే మేమిద్దరం కలిసి ఆరో సినిమా చేయగలుగుతున్నాం అంటూ ట్వీట్ చేసింది. షారుఖ్‌ఖాన్ చేతిలో తన చేయి వేసి ఉన్న ఫొటోను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం షార్‌ఖాన్‌ఖాన్‌తో కలిసి కింగ్ సినిమా చేస్తోంది దీపికా పదుకొనె. ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు.
సెటైర్స్…
షారుఖ్‌ఖాన్ సినిమా గురించి పెట్టిన ఈ పోస్ట్ ద్వారా ఇన్‌డైరెక్ట్‌గా కల్కి మేకర్స్‌పై దీపికా సెటైర్లు వేసినట్లు నెటిజన్లు చెబుతున్నారు. సినిమా నుంచి తప్పుకోవడానికి గల కారణాలను సెటైరికల్‌గా చెప్పిందని అంటున్నారు. దీపికా పోస్ట్ వైరల్ అవుతోంది. ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తూ పలువురు ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతోన్నారు. సుమతి పాత్రకు దీపికా పదుకొనె తప్ప మరెవరూ న్యాయం చేయలేరని అంటున్నారు. దీపికా లేకుండా కల్కి 2 చూడటం కష్టమని అంటున్నారు. కాగా దీపికా ప్లేస్‌లో ఎవరిని సీక్వెల్ కోసం మేకర్స్ ఎంచుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
1100 కోట్ల కలెక్షన్స్…
కల్కి మూవీలో సుమతి పాత్రలో దీపికా పదుకొనె నటించింది. ఈ మూవీతోనే ఆమె టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రూ. 1100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. దాంతో సీక్వెల్‌పై భారీగా అంచనాలు మొదలయ్యాయి. కల్కి సీక్వెల్ షూటింగ్ నవంబర్ నుంచి మొదలుకాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో అమితాబ్‌బచ్చన్ కీలక పాత్ర పోషించగా…కమల్‌హాసన్ విలన్‌గా నటించారు.


