Deepika Padukone: కల్కి 2 నుంచి ఇటీవలే దీపికా పదుకొనెను పక్కన పెట్టారు మేకర్స్. స్పిరిట్, కల్కి 2… వరుసగా రెండు ప్రభాస్ సినిమాల నుంచి దీపికా పదుకొనె తప్పుకోవడం బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్‌కు హ్యాండిచ్చిన దీపికా పదుకొనె హాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
హాలీవుడ్‌లోకి రీఎంట్రీ…
హాలీవుడ్ టాప్ యాక్టర్ విన్ డీజిల్ హీరోగా నటించిన ట్రిపుల్ ఎక్స్ ది రిటర్న్ ఆఫ్ జెండర్ కేజ్ మూవీతో హీరోయిన్‌గా దీపికా పదుకొనె హాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. 2017లో రూపొందిన ఈ హాలీవుడ్ స్పై యాక్షన్ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీలో సెరెనా ఉంగర్ అనే క్యారెక్టర్‌లో గ్లామర్, యాక్షన్‌తో కూడిన క్యారెక్టర్‌లో దీపికా అదరగొట్టింది. ముఖ్యంగా విన్ డీజిల్, దీపికా కెమిస్ట్రీ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది.
సీక్వెల్ కన్ఫామ్…
ఎనిమిదేళ్ల తర్వాత ట్రిపుల్ ఎక్స్ మూవీకి సీక్వెల్ రాబోతుంది. ఈ విషయాన్ని విన్ డీజిల్ అఫీషియల్‌గా ప్రకటించాడు. ముంబాయి బ్యాక్‌డ్రాప్‌లో ఈ సీక్వెల్ రూపొందబోతున్నట్లు వెల్లడించాడు. ట్రిపుల్ ఎక్స్ పార్ట్ 2లో దీపికా పదుకొనె కూడా నటించనున్నదట.
Also Read – RS Brothers:’ఆర్‌ఎస్ బ్రదర్స్’లో సందడి చేసిన నాగచైతన్య దంపతులు.. భారీగా తరలివచ్చిన అభిమానులు!
ముంబాయిలోనే షూటింగ్‌లో…
పార్ట్ వన్‌తో పోలిస్తే ట్రిపుల్ ఎక్స్ సీక్వెల్‌లో దీపికా రోల్‌కు ఇంపార్టెన్స్‌తో పాటు లెంగ్త్ కూడా పెరగనున్నట్లు చెబుతున్నారు. దీపికా పాత్రకు సంబంధించిన షూటింగ్ చాలా వరకు ముంబాయిలోనే సాగనుందట. అందుకే ఇమ్మిడియేట్‌గా దీపికా ఈ హాలీవుడ్ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. త్వరలోనే ఈ హాలీవుడ్ మూవీ సీక్వెల్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం.
ప్రస్తుతం షారుఖ్ ఖాన్‌తో కింగ్ మూవీ చేస్తోంది దీపికా పదుకొనె. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ఇటీవలే సెట్స్‌పైకి వచ్చింది. షారుఖ్‌ఖాన్, దీపికా పదుకొనె కాంబినేషన్‌లో రాబోతున్న ఆరవ మూవీ ఇది.
కాగా కల్కి 2 నుంచి దీపికా పదుకొనె తప్పుకోవడానికి కారణం ఏమిటన్నది టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది. రెమ్యూనరేషన్ ఎక్కువ అడగటంతో పాటు దీపికా పదుకొనె పెట్టిన డిమాండ్ల వల్ల మేకర్స్ ఆమెను సినిమా నుంచి పక్కన పెట్టినట్లు సమాచారం. కాగా కల్కి సీక్వెల్ షూటింగ్‌లో దీపికా పదుకొనె 20 రోజుల వరకు పాల్గొన్నట్లు సమాచారం. ఆమె పోర్షన్స్ మొత్తాన్ని రీషూట్ చేయడం మేకర్స్‌కు సవాల్‌గా మారినట్లు టాక్ వినిపిస్తోంది.
Also Read – Health:ఆయుర్వేద రారాజు అశ్వగంధ.. వీళ్లకు మాత్రం విషం..!


