Deepika Padukone: ఈ మధ్య అటు సౌత్‌లో ఇటు నార్త్‌లో బాగా హాట్ టాపిక్‌గా మారిన హీరోయిన్ దీపికా పదుకొనే. ఈ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమానే రిజెక్ట్ చేసిందని వార్తలు వచ్చాయి. కానీ, దర్శకుడే ఆమెని తప్పించి ఆమె స్థానంలో యానిమల్ బ్యూటీని తీసుకున్నారు. అయితే, దీపికా మరోసారి సంచలన నిర్ణయం తీసుకుందనేది లేటెస్ట్ న్యూస్. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.
ప్రభాస్ హీరోగా సందీప్ ‘స్పిరిట్’ మూవీని ప్రకటించారు. ఇందులో డార్లింగ్‌కి జంటగా దీపికాని ఎంపిక చేయగా, క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆ తర్వాత సినిమా నుంచి తప్పుకుని.. సంచలనం సృష్టించింది దీపికా పదుకొనే. అలాగే, తాజాగా మరో సినిమా నుంచి కూడా తప్పుకుందని ప్రస్తుతం నెట్టింట వార్తలు ప్రచారం అవుతున్నాయి. బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితా బచ్చన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘ది ఇంటర్న్’ సినిమాలో దీపికా పదుకొనే కూడా ఓ కీలక పాత్ర చేయాల్సి ఉంది. అయితే, ఈ చిత్రంలో ఆమె నటించకూడదని నిర్ణయం తీసుకుందట.
Also Read- Kamal Haasan: కమల్‌హాసన్‌ను చంపేస్తా…టీవీ నటుడి బెదిరింపులు – కేసు నమోదు చేసిన పోలీసులు
హాలీవుడ్ సెన్షేషనల్ మూవీ ‘ది ఇంటర్న్’కి ఈ మూవీ హిందీ రీమేక్. ఈ సినిమాను స్వయంగా దీపికా పదుకొనే భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. అయితే, ప్రొడక్షన్ మొదలైన తర్వాత క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఈ సినిమాలో కూడా నటించకూడదని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కేవలం నిర్మాతగా మాత్రమే వ్యవహరించనుందట. అప్పుడేమో ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కనున్న ‘స్పిరిట్’లో ముందు దీపికా పదుకొనేని అనుకుంటే, రోజుకి 8 గంటలే పని చేస్తానని, దాదాపు, రూ.28 కోట్ల రెమ్యూనరేషన్‌తో పాటు లాభాల్లో 15 శాతం వాటా కావాలని కోరడంతో ఆమె పెట్టిన షరతులకి ఖంగుతిని ప్రాజెక్ట్ నుంచి తప్పించారు.
ఇప్పుడు, అమితాబ్ బచ్చన్ సినిమా నుంచి తప్పుకోవడం అంతటా హాట్ టాపిక్‌గా మారింది. ఇలా అయితే, ఇక దీపికాకి సౌత్ సినిమాలలో అవకాశాలు ఇవ్వరని సినీ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగులో ఆమె నటించాల్సిన కల్కీ 2 ఇంకా మొదలవలేదు. పార్ట్ 1 లో ఆమె పాత్రకి మంచి ప్రశంసలు దక్కాయి. కానీ, ఇప్పుడు దీపిక ప్రవర్తన ఆశ్చర్యానికి గురి చేస్తుండటంతో, కల్కీ 2 లో ఆమెని కంటిన్యూ చేస్తారా..? లేదా అని అందరిలో డైలమా నెలకొంది.
Also Read- Pooja Hegde: బాహుబలి 3లో హీరోయిన్‌గా ఛాన్స్ ఇవ్వమని ప్రభాస్‌ను అడుగుతా – మనసులో మాట చెప్పేసింది


