DEVARA: జనాలు సినిమాలు థియేటర్లలో చూడడం మానేసి, ఓటిటీలకు అలవాటు పడిపోయిన టైమ్‌లో వచ్చింది ఒక సినిమా – అదే దేవర. ఈ సినిమా ఎన్టీఆర్ అభిమానులకే కాకుండా, థియేటర్లలో చూసిన ప్రతి ఒక్కరికి పండగలా అనిపించింది.
అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్ అయితే థియేటర్లను ఒక మ్యూజిక్ కాన్సర్ట్‌లా మార్చేసింది. ముఖ్యంగా చుట్టమల్లే పాట డిఫరెంట్ వైబ్‌ని సృష్టించింది. కొరటాల శివ డైరెక్షన్, రత్నవేలు విజువల్స్, అనిరుధ్ మ్యూజిక్ మొత్తం కలిసి సినిమాను నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. విలన్‌గా సైఫ్ అలీ ఖాన్ అదరగొట్టగా, జాహ్నవి కపూర్ కూడా తన మొదటి తెలుగు సినిమాతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/ntr-special-guest-at-kantara-2-pre-release-event/
DEVARA 2: అయితే సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజులకే నెగటివిటీ మొదలైంది. క్లైమాక్స్‌లో పార్ట్ 2 ఉంటుందని ముందే చెప్పినా, సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్, నెగటివ్ కామెంట్స్ వల్ల ఫ్యాన్స్ అనుమానంలో పడ్డారు. “దేవర 2 వస్తుందా లేదా?” అన్న ఉత్కంఠ పెరిగింది. కానీ ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేశారు ఎన్టీఆర్ స్వయంగా. MAD 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో “భయపడాల్సిన అవసరం లేదు, దేవర 2 కచ్చితంగా ఉంటుంది” అన్న ఒక్క మాటతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
ఇక దేవర రిలీజ్ అయ్యి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా మూవీ టీమ్ దేవర 2 పోస్టర్‌ను విడుదల చేసింది. “1 Year for Devara Tandavam” అంటూ రిలీజ్ చేసిన ఆ పోస్టర్‌లో “వర” అనే పదాన్ని బ్లడ్ కలర్‌లో హైలైట్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక దేవర 2 షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/mohan-babu-first-look-unveiled-from-nani-paradise-movie/
ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వస్తున్న డ్రాగన్ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అదనంగా నెల్సన్, త్రివిక్రమ్ డైరెక్షన్‌లో కూడా సినిమాలు లైన్‌లో ఉన్నాయి. వీటి మధ్యలోనే దేవర 2 కూడా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఏది ఏమైనా, దేవర అనే సినిమా అభిమానులకు ఒక పండగలాంటిదే. అది ఎంత త్వరగా వస్తే అంత మంచిది అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.


