Monday, May 19, 2025
Homeచిత్ర ప్రభDhanush Aishwarya: మేము కలిసి ఉండలేము: ధనుష్‌ దంపతులు

Dhanush Aishwarya: మేము కలిసి ఉండలేము: ధనుష్‌ దంపతులు

తమిళ స్టార్ హీరో ధనుష్(Dhanush), ఆయన సతీమణి ఐశ్వర్య(Aishwarya) చెన్నైలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టు ముందు హాజరయ్యారు. తాము కలిసి ఉండాలని అనుకోవడం లేదని.. విడిపోవాలని నిర్ణయించుకున్నామని కోర్టుకు తెలిపారు. తాము విడిపోవడానికి గల కారణాలను వివరించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం ఈనెల 27వ తేదీకి తుది తీర్పును వాయిదా వేసింది.

- Advertisement -

కాగా సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె అయిన ఐశ్వర్య, ధనుష్ ఇద్దరు ప్రేమించుకున్నారు. కొంతకాలం తర్వాత ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో 2004 నవంబర్ 18న పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అప్పటి నుంచి ఎంతో అన్యోయంగా కలిసి జీవించారు.

అయితే 18 ఏళ్ల వీరి వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు 2022లో ప్రకటించారు. విడాకుల కోసం చెన్నైలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. అయితే పిల్లల కోసం వీరిద్దరూ మళ్లీ కలుస్తారని అందరూ భావించారు. కానీ తాజాగా విచారణకు హాజరుకావడంతో విడిపోవడానికే ఈ జంట మొగ్గు చూపినట్లు స్పష్టం అయింది. దీంతో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News