Dhanush: ధనుష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఇడ్లీకొట్టు మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ థియేటర్లలో రిలీజై నెల రోజులు కాకముందే ఓటీటీలోకి వస్తోంది. అక్టోబర్ 29న నెట్‌ఫ్లిక్స్‌లో ఇడ్లీకొట్టు రిలీజ్ కాబోతుంది. తమిళంతో పాటు తెలుగు భాషలో స్ట్రీమింగ్ అవుతోంది.
తమిళంలో ఇడ్లీకడై పేరుతో రూపొందిన ఈ సినిమాను తెలుగులో ఇడ్లీకొట్టు పేరుతో డబ్ చేశారు. దసరా కానుకగా థియేటర్లలో రిలీజైన ఈ ఫ్యామిలీ డ్రామా సినిమాలో నిత్యామీనన్ హీరోయిన్‌గా నటించింది. అర్జున్ రెడ్డి ఫేమ్ షాలినీ పాండేతో పాటు అరుణ్ విజయ్, సత్యరాజ్, పార్తిబన్ కీలక పాత్రలు పోషించారు. హీరోగా, డైరెక్టర్‌గానే కాకుండా ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌గా కూడా ధనుష్ వ్యవహరించాడు.
ఇడ్లీకొట్టు కాన్సెప్ట్‌తో పాటు ధనుష్, నిత్యామీనన్ యాక్టింగ్‌కు ప్రశంసలు వచ్చాయి. కానీ స్టోరీ స్లోగా సాగడం, ఎమోషన్స్ అనుకున్న స్థాయిలో పండకపోవడంతో ఇడ్లీకొట్టు కమర్షియల్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ థియేటర్లలో 70 కోట్ల వరకు వసూళ్లను దక్కించుకున్నది. తమిళంలో పర్వాలేదనిపించిన ఈ మూవీ తెలుగులో మాత్రం బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. కాంతార చాప్టర్ వన్‌కు పోటీగా రిలీజ్ కావడం కూడా ఇడ్లీకొట్టుకు మైనస్‌గా మారింది.
Also Read – Ram Charan: ఉపాసనకి కవల పిల్లలు! అల్లు గొడవలు చల్లారలేదా?
పల్లెటూరితో ప్రతి ఒక్కరికి ఉన్న జ్ఞాపకాలను గుర్తుకుతెస్తూ ధనుష్ ఈ సినిమాను రూపొందించారు. ఇందులో మురళీ అనే యువకుడిగా నాచురల్ యాక్టింగ్‌తో ధనుష్ అభిమానులను మెప్పించాడు. డబ్బు సంపాదించడం కోసం విదేశాల్లో సెటిల్ కావాలని కలలు కన్న ఓ యువకుడిలో తండ్రి మరణం ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందనే పాయింట్‌తో ఇడ్లీకొట్టు మూవీ రూపొందింది. ధనుష్ దర్శకత్వం వహించిన నాలుగో మూవీ ఇది.
ఇడ్లీకడై మూవీతో అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండే లాంగ్ గ్యాప్ తర్వాత తమిళంలోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో హిట్టు కొట్టి కోలీవుడ్‌లో సెటిల్ కావాలని కలలు కన్నది. కానీ ఆమె ఆశలు మాత్రం తీరలేదు. ఇడ్లీకొట్టు తర్వాత బాలీవుడ్ మూవీ తేరే ఇష్క్ మే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ధనుష్. ఆనంద్ ఎల్ రాయ్ దర్వకత్వం వహిస్తున్న ఈ సినిమా నవంబర్ 28న రిలీజ్ కాబోతుంది.
Also Read – FAUZI: ప్రభాస్ ‘ఫౌజీ’లో కన్నడ బ్యూటీ, ఫ్యాన్స్‌కి మరో సర్ప్రైజ్!


