Saturday, June 21, 2025
Homeచిత్ర ప్రభKubera: ‘కుబేర’ ఫస్ట్ డే కలెక్షన్స్.. హిట్ కావాలంటే ఇంకా ఎన్ని కోట్లు రాబట్టాలో తెలుసా?

Kubera: ‘కుబేర’ ఫస్ట్ డే కలెక్షన్స్.. హిట్ కావాలంటే ఇంకా ఎన్ని కోట్లు రాబట్టాలో తెలుసా?

Kubera Collections: కోలీవుడ్ వెర్సటైల్ స్టార్ ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాంబోలో రూపొందిన చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సునీల్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 20 రిలీజైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్‌ను రాబడుతోంది. ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు తొలి రోజున ఈ చిత్రం రూ.30.05 కోట్లు గ్రాస్ కలెక్షన్స్‌ (రూ.15.25 కోట్లు షేర్ కలెక్షన్స్)ను కుబేర రాబట్టింది. ఇప్పుడు ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవాలంటే రూ.66 కోట్లు షేర్ వసూళ్లు రావాలి. ఇప్పటికి అటు ఇటు రూ.15 కోట్లు మాత్రమే వచ్చాయి.

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున కుబేర కలెక్షన్స్ …

నైజాం: 2.62 కోట్లు
సీడెడ్ : 88 లక్షలు
ఉత్తరాంధ్ర : 1.04 కోట్లు
ఈస్ట్ : 56 లక్షలు
వెస్ట్ : 38 లక్షలు
గుంటూరు : 51 లక్షలు
గుంటూరు : 50 లక్షలు
నెల్లూరు : 26 లక్షలు

మొత్తంగా చూస్తే తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.75 కోట్లు షేర్ కలెక్షన్స్ వచ్చాయి. గ్రాస్ ప్రకారం చూస్తే రూ. 11.80 కోట్లు అని ట్రేడ్ వర్గాలంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.34 కోట్లు రావాలి. ఇప్పటికి దాదాపుగా రూ.7 కోట్లే వచ్చాయి. అంటే ఇంకా దాదాపు రూ.27 కోట్లు తెలుగు స్టేట్స్ నుంచే రావాల్సి ఉంది.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/shruti-haasan/

వరల్డ్ వైడ్‌గా తొలి రోజున కుబేర కలెక్షన్స్ …

ఏపీ, నైజాం- రూ.11.80 కోట్లు
తమిళనాడు – రూ. 4.60 కోట్లు
కర్ణాటక – రూ. 1.60 కోట్లు
కేరళ – 30 లక్షలు
హిందీ, రెస్టాఫ్ ఇండియా – రూ. 90 లక్షలు
ఓవర్ సీస్ – రూ. 10.85 కోట్లు
మొత్తంగా చూస్తే రూ. 30.05 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయ. (షేర్ వసూళ్ల ప్రకారం చూస్తే ఈ లెక్క రూ. 15.25 కోట్లు అని ట్రేడ్ వర్గాలంటున్నాయి.

వరల్డ్ వైడ్‌గా థియేట్రికల్ బిజినెస్ రూ.65 కోట్లు జరిగింది. అంటే రూ.66 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. తొలి రోజున దాదాపుగా రూ.16 కోట్లు వచ్చాయి. అంటే ఇంకా రూ.50 కోట్లు రావాలి. మరి శని, ఆదివారాల్లో కుబేర సినిమా ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News