Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభDhanush: టాలీవుడ్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్..

Dhanush: టాలీవుడ్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్..

Dhanush: ఇప్పుడు మన తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ప్రభాస్ (Prabhas), అల్లు అర్జున్ (Allu Arjun), రామ్ చరణ్ (Ram Charan), ఎన్‌టిర్ లాంటి హీరోలందరూ పాన్ ఇండియా వైడ్ గా పాపులారిటీని పెంచుకొని బ్లాక్‌బస్టర్లు కొడుతున్నారు. బాలీవుడ్ దర్శకుల కంటే మన సౌత్ దర్శకుల్లో ఉన్నా సత్తా ఇది అని నిరూపించారు కూడా. దాంతో బాలీవుడ్ తో పాటు మిగతా సౌత్ భాషల హీరోలు కూడా మన సినిమాల్లో నటించేందుకు ఉత్సాహపడుతున్నారు.

- Advertisement -

మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ మన తెలుగులో ఇప్పటికే మహానటి, సీతారామం, లక్కీభాస్కర్ వంటి చిత్రాల్లో నటించి తెలుగు హీరోగా మారిపోయాడు. ఈ మూడు సినిమాలు దుల్కర్ కి తెలుగులో మంచి హిట్స్ గా నిలిచాయి. అదే క్రమంలో కోలీవుడ్ స్టార్ ధనుష్ కూడా మన దర్శకులతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘సార్’ మూవీతో హిట్టు కొట్టిన ధనుష్, ఆ తర్వాత శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన ‘కుబేర’తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ప్రస్తుతం తమిళంలో తన దర్శకత్వంలో ‘ఇడ్లీ కడై’ అనే సినిమాను చేస్తున్నాడు.

Also Read – Sandeep Reddy Vanga: బాహుబలి సినిమాపై సంచలన వ్యాఖ్యలు

ఈ మూవీతో పాటు ధనుష్ చేతిలో మరికొన్ని భారీ సినిమాలున్నాయి. ఇంత బిజీలోనే కూడా ధనుష్ మన తెలుగు దర్శకుడితో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా లేటెస్ట్ న్యూస్ ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ‘నీదీ నాదీ ఒకే కథ’ సినిమాతో 2018లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన వేణు ఊడుగుల.. మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత 2022లో ‘విరాటపర్వం’ మూవీతో వచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకొని విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. దగ్గుబాటి రానా, సాయిపల్లవి నటించిన ఈ సినిమాలో ప్రియమణి కీలక పాత్రలో కనిపించింది.

ఈ సినిమా కమర్షియల్‌గా ఆశించినంత విజయం సాధించలేకపోయినా కూడా దర్శకుడిగా వేణు ఊడుగులకి మంచి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకూ మరో సినిమా రాలేదు. తాజాగా వేణు ఊడుగుల ఓ కథని రెడీ చేసుకున్నాడట. ఈ స్టోరీని కోలీవుడ్ స్టార్ ధనుష్‌ కి వినిపించాడట. ఆయనకు ఈ కథ నచ్చడంతో చేద్దామని చెప్పినట్టు లేటెస్ట్ న్యూస్. ఇక ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. యూవీ నుంచి మంచి చిత్రాలొస్తున్న సంగతి తెలిసిందే. చూడాలి మరి అధికారికంగా వేణు ఊడుగుల-ధనుష్ సినిమాను ఎప్పుడు ప్రకటిస్తారో.

Also Read – Meenakshi Chaudhary: హర్ట్ అయ్యా.. టాలీవుడ్ కి గుడ్ బై..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad