Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభDhanush: ప్రభాస్ ఫ్లాప్ దర్శకుడికి ధనుష్ ఛాన్స్.. ఏంటి ఇంత నమ్మకం?

Dhanush: ప్రభాస్ ఫ్లాప్ దర్శకుడికి ధనుష్ ఛాన్స్.. ఏంటి ఇంత నమ్మకం?

- Advertisement -

Dhanush : ఇటీవల చాలా మంది వేరే భాష హీరోలు తెలుగులో, తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందులో తమిళ్ స్టార్ హీరో ధనుష్ ఒకరు. ఇప్పటికే ధనుష్ తెలుగులో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘సర్’ అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉంది. ఇక ఇటీవలే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా మరో సినిమా మొదలైంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది.

తాజాగా ధనుష్ మరో టాలీవుడ్ దర్శకుడికి ఓకే చెప్పినట్టు సమాచారం. ప్రభాస్ సాహో తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమా చేశాడు. లవ్, పీరియాడికల్ నేపథ్యంలో దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అభిమానులని నిరాశపరిచింది. బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం చూసి దాదాపు 100 కోట్ల లాస్ ని మూట కట్టుకుంది.

రాధేశ్యామ్ సినిమాపై అభిమానులు, ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకోగా ఆ అంచనాలన్నీ తారుమారయ్యాయి. దీంతో ఆ సినిమా రిలీజ్ అయ్యాక డైరెక్టర్ రాధాకృష్ణని దారుణంగా ట్రోల్ చేశారు అభిమానులు, నెటిజన్లు. అప్పట్నుంచి రాధాకృష్ణ మళ్ళీ బయట ఎక్కడ కనపడలేదు. ఇటీవలే ఈ డైరెక్టర్ ధనుష్ కి కథ చెప్పినట్టు, ధనుష్ కూడా రాధాకృష్ణకి ఓకే చెప్పినట్టు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News