Dharmendra: ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర ఒంట్లో అస్వస్ధత కారణంగా ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో చేరారు. మామూలు ఆరోగ్య పరీక్షల కోసమే వచ్చినా, కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడటంతో డాక్టర్లు వెంటనే ఆయన్ను ఐసీయూ కు మార్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్లు, కుటుంబ సభ్యులు చెప్పారు. వృధాప్యం వల్ల (89 ఏళ్లు) అబ్జర్వేషన్ నిమిత్తం ఐసీయూలో ఉంచినట్లు తెలిపారు.
ధర్మేంద్ర చాలా ఏళ్ల పాటు బాలీవుడ్‌ను ఏలారు. ఆయన నటించిన సినిమాల్లో షోలే ఇండియన్ క్లాసిక్ సినిమాలో ఒకటి. అందులో ఆయన ‘వీరు’ పాత్రలో జీవించారు అనే చెప్పాలి.
తండ్రి హాస్పిటల్‌లో ఉండటంతో, ఆయన కొడుకులు సన్నీ డియోల్, బాబీ డియోల్ ఇద్దరూ షూటింగ్‌లు పక్కనపెట్టి తండ్రి దగ్గరే ఉన్నారు.
సన్నీ డియోల్ రీసెంట్‌గా గోపిచంద్ మలినేని దర్శకత్వం లో ‘జాట్’ గా మెప్పించారు. బాబీ డియోల్ కూడా ‘యానిమల్’ లో విలన్‌గా మెప్పించి, ఇప్పుడు తెలుగులో కూడా డాకు మహారాజ్, హరి హర వీర మల్లు సినిమాలతో అందరిని ఆకట్టుకుంటున్నాడు.


