Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభBison: ‘బైసన్’ మూవీ ఓటీటీలోకి.. రిలీజ్ డేట్ ఫిక్స్!

Bison: ‘బైసన్’ మూవీ ఓటీటీలోకి.. రిలీజ్ డేట్ ఫిక్స్!

BISON: యంగ్ హీరో ధృవ్ విక్రమ్ ఎట్టకేలకు ఒక మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. విక్రమ్ కొడుకు ధృవ్ చాలా కాలంగా ఒక మంచి సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆ వెయిటింగ్ అంతా ‘బైసన్’ మూవీతో ఎండ్ అయిందని చెప్పాలి. అక్టోబర్ 17న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది ధృవ్‌కు ఒక విధంగా ఫస్ట్ హిట్ అని చెప్పాలి. ధృవ్ ఇంతకుముందు ‘అర్జున్ రెడ్డి’ రీమేక్‌తో డెబ్యూ ఇచ్చినా, అది పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత ఫాదర్‌తో కలిసి చేసిన ‘మహాన్’ మూవీ కూడా థియేట్రికల్ రిలీజ్ కాలేదు. అందుకే, మూడేళ్ల గ్యాప్ తర్వాత ధృవ్ ఈ ‘బైసన్’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు.

- Advertisement -

ALSO READ: Shruti Haasan: మ‌ళ్లీ మ‌హేష్ కోసం శ్రుతీ హాస‌న్ .. ఈసారి ఏం చేసిందంటే!

ఈ సినిమా స్టోరీ మొత్తం కబడ్డీ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తుంది. కబడ్డీపై చాలా సినిమాలు వచ్చినా, ‘బైసన్’ మాత్రం డిఫెరెంట్ స్టోరీ టెల్లింగ్తో అందరినీ ఎట్రాక్ట్ చేసింది. ఈ మూవీకి మారి సెల్వరాజ్ డైరెక్టర్. అతని సినిమాలు ఎప్పుడూ విలేజ్ బ్యాక్‌డ్రాప్లో, చాలా నేచురల్‌గా, రియలిస్టిక్‌గా ఉంటాయి. ఇందులో కబడ్డీ ప్లేయర్ క్యారెక్టర్‌ను మారి సెల్వరాజ్ అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. ఇక ధృవ్ విక్రమ్ ఆ క్యారెక్టర్‌లో జీవించేశాడు అనే చెప్పాలి. అతని యాక్టింగ్ చాలా బాగా కుదిరింది. అందుకే ఈ సినిమా తమిళ్‌తో పాటు తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది.

ALSO READ: Raviteja: మాస్‌జాత‌ర ఫెయిల్యూర్‌కు ర‌వితేజ‌నే కార‌ణ‌మా? – సోష‌ల్ మీడియా ప్ర‌చారంలో నిజ‌మెంత?

ధృవ్ విక్రమ్ యాక్టింగ్‌తో పాటు, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పెర్ఫార్మెన్స్ కూడా ఈ మూవీకి చాలా హెల్ప్ అయింది. ఆమె మామూలుగా చేసే గ్లామర్ రోల్స్‌కు డిఫరెంట్‌గా, ఇందులో తన నటనతో అందరినీ ఇంప్రెస్ చేసింది. మొత్తానికి ఈ ‘బైసన్’ మూవీ మంచి సక్సెస్ సాధించింది. థియేటర్లలో చూడని వాళ్ల కోసం ఈ సినిమా త్వరలో ఓటీటీలోకి రాబోతోంది. నవంబర్ 21 నుండి ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad