Dhruv Vikram: చియాన్ విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్‌తో అనుపమ పరమేశ్వరన్ ప్రేమాయణం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ధృవ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన బైసన్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. కోలీవుడ్‌లో హిట్టు టాక్‌ను సొంతం చేసుకున్న ఈ మూవీ తెలుగులోకి మాత్రం వారం ఆలస్యంగా థియేటర్లలోకి వచ్చింది. బైసన్‌తో ఫస్ట్ కమర్షియల్ సక్సెస్‌ను అందుకున్నాడు ధ్రువ్ విక్రమ్. కాగా బైసన్ షూటింగ్‌లోనే ధ్రువ్ విక్రమ్‌తో అనుపమ పరమేశ్వరన్‌కు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారినట్లు టాక్ వినిపిస్తోంది. అప్పట్లో వీరిద్దరి లిప్‌లాక్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
బైసన్ ప్రమోషన్స్‌లో ధ్రువ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్ చాలా క్లోజ్‌గా కనిపించారు. ఈ ప్రమోషన్స్‌లో వీరిద్దరి బాండింగ్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. బైసన్ తమిళ ప్రమోషన్స్‌లో ధృవ్ విక్రమ్‌పై పొగడ్తల వర్షం కురిపించింది అనుపమ పరమేశ్వరన్. ధృవ్ పేరు విన్న ప్రతిసారి అనుపమ సిగ్గుపడుతూ కనిపించింది. ఓ ఈవెంట్‌లో అతడిని కౌగిలించుకున్నది. మాటలతో బయటకు పెట్టకపోయినా తన పనులతో ఇన్‌డైరెక్ట్‌గా ధ్రువ్‌తో ప్రేమలో ఉన్నట్లుగా అనుపమ హింట్ ఇచ్చేసిందని చెబుతున్నారు.. గతంలో అనుపమ పరమేశ్వరన్ తమిళంలో కొన్ని సినిమాలు చేసింది. అవన్నీ తెలుగులోకి డబ్ అయ్యాయి. కానీ ఆ సినిమాల తెలుగు ప్రమోషన్స్‌కు అటెండ్ కాలేదు అనుపమ. కానీ ధ్రువ్ విక్రమ్‌తో కలిసి బైసన్ తెలుగు ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా పాల్గొన్నది. ధ్రువ్ కోసమే అనుపమ తెలుగు ప్రమోషన్స్‌కు అటెండ్ అయినట్లు ప్రచారం జరిగింది.
Also Read – Vidyabalan: జైలర్2లో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ – రజనీ మూవీతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ
తాజాగా అనుపమతో ప్రేమను ధ్రువ్ విక్రమ్ కూడా కన్ఫామ్ చేశాడని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. బైసన్ ప్రమోషన్స్‌లో భాగంగా పెర్ల్ మానీ మలయాళం టాక్ షోకు గెస్ట్‌గా అటెండ్ అయ్యాడు విక్రమ్. ఈ టాక్ షోలో నేను చేసిన సెలిబ్రిటీ ఇంటర్వ్యూలూ ఇదివరకు ఏవైనా చూశారా అని ధ్రువ్‌ను.. పెర్ల్ మానీ అడిగింది. ఈ టాక్ షోకు ఫహాద్ ఫాజిల్, నజ్రియా నజీమ్‌తో పాటు చాలా మంది మలయాళ సెలిబ్రిటీలు గెస్ట్‌లు వచ్చారు. కానీ వారందరిని పేరును కాదని కేవలం తాను అనుపమ పరమేశ్వరన్ ఇంటర్వ్యూ మాత్రమే చూశానని ధ్రువ్ విక్రమ్ సమాధానం ఇచ్చాడు. ఈ టాక్ షోలో అనుపమ గురించి పెర్ల్ మానీ అడిగిన ప్రతి ప్రశ్నకు ధ్రువ్ సిగ్గుపడిపోవడం, తడబడుతూ సమాధానాలు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఈ టాక్ షో ద్వారా ఇన్‌డైరెక్ట్‌గా ధ్రువ్ కూడా అనుపమతో ప్రేమపై క్లారిటీ ఇచ్చాడని చెబుతున్నారు.
బైసన్ మూవీ తన కంటే వయసులో చిన్నవాడైన ధ్రువ్ విక్రమ్‌ను ప్రేమించే యువతిగా అనుపమ పరమేశ్వరన్ కనిపించింది. ఈ స్పోర్ట్స్ డ్రామా థ్రిల్లర్ మూవీ యాభై కోట్లకు చేరువలో ఉంది. కుల వివక్షకు కబడ్లీ బ్యాక్‌డ్రాప్‌ను జోడించి డైరెక్టర్ మారి సెల్వరాజ్ ఈ మూవీని రూపొందించారు. మరోవైపు తెలుగులో కిష్కిందపురితో పెద్ద హిట్టు అందుకుంది అనుపమ పరమేశ్వరన్. హారర్ కథాంశంతో రూపొందిన ఈ మూవీలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించాడు.ప్రస్తుతం తెలుగులో భోగి, మలయాళంలో లాక్‌డౌన్, ది పెట్ డిటెక్టివ్ సినిమాలు చేస్తోంది
Also Read – Ro – ko: ఇక దేశ వాలీ మ్యాచుల్లో రోహిత్, కొహ్లీ?


