Akhanda 2: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా అఖండ 2. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. నిన్నా మొన్నటి వరకూ ఈ మూవీకి మరో భారీ చిత్రం పోటీ లేదనుకున్నారు. కానీ, ఇప్పుడు ఓ బాలీవుడ్ స్టార్ హీరో పోటీకొచ్చాడు. ఆ హీరో ఎవరూ, ఏ సినిమా బాలయ్య అఖండ 2కి పోటీగా రాబోతుందీ..అనే విషయాలను వివరాల్లోకి వెళ్ళి తెలుసుకుందాం..
బోయపాటి శ్రీను, బాలకృష్ణలది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. ఇప్పటికే, మూడు సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న ఈ కాంబోలో వస్తోన్న 4వ సినిమా అఖండ 2. ఇటీవల ఈ సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో పాటు బాలయ్యకి సంబందించిన ఓ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. అంతేకాదు, మొదటిసారి బాలయ్య సినిమా పాన్ ఇండియా వైడ్‌గా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో రిలీజ్ కాబోతుంది.
ఇక ఈ సినిమాను వచ్చే డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ డేట్ కి రిలీజ్ కావాల్సిన చిన్న సినిమాలు కూడా పోస్ట్ పోన్ అయ్యాయి. కాబట్టి, సోలోగా వస్తున్న బాలయ్య బాక్సాఫీస్ ని షేక్ చేసి వసూళ్ళు రాబడతారని చెప్పుకున్నారు. కానీ, ఇదే డేట్ కి బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటిస్తున్న ‘దురంధర్’ పోటీకి దిగుతోంది. మన సౌత్ భాషల విషయం పక్కన పెడితే, హిందీలో బాలయ్య ‘అఖండ 2’కి ఈ సినిమా గట్టి పోటీ ఇవ్వడం ఖాయమంటున్నారు.
బాలయ్య సినిమాలకి హిందీలో మంచి మార్కెట్ ఉంది. అందుకే, ‘అఖండ 2’ ని అక్కడ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ, ‘దురంధర’ మూవీతో పోటీ తప్పడం లేదు. ఈ సినిమాలో సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, మాధవన్, అర్జున్ రాంపాల్ లాంటి క్రేజీ స్టార్స్ కూడా ఉన్నారు. ముందు నుంచి ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చూడాలి, మరి ‘అఖండ 2’ కలెక్షన్స్ కి దురంధర్ ఏమేరకు గండి కొడుతుందో. అయితే, ఇటీవల కాలంలో హిందీ సినిమాలు భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. ఒకవేళ దురంధర్ విషయంలో అదే జరిగితే బాలయ్య సినిమాకి తిరుగుండదు.
Also Read- Pooja Hegde: పూజా హెగ్డేకు బంపరాఫర్ – అమరన్ డైరెక్టర్ మూవీలో హీరోయిన్‌గా బుట్టబొమ్మ


