Thursday, September 19, 2024
Homeచిత్ర ప్రభAvatar 2: జేమ్స్ కెమెరూన్ మన నారప్ప మూవీ చూసి కాపీ కొట్టాడా?!

Avatar 2: జేమ్స్ కెమెరూన్ మన నారప్ప మూవీ చూసి కాపీ కొట్టాడా?!

- Advertisement -

Avatar 2: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ని మరోసారి మంత్రముగ్ధులని చేసిన బిగ్గెస్ట్ విజువల్ ట్రీట్ అవతార్ 2. హాలీవుడ్ ఆల్ టైం టాప్ దర్శకుడు జేమ్స్ కెమెరూన్ తెరకెక్కించిన ఈ చిత్రం విజువల్ అండ్ ఎమోషనల్ చిత్రంగా తెరకెక్కి రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ అయితే అందుకుంటుంది. ఈ సినిమా తెలుగులో కూడా చాలా గ్రాండ్ గా రిలీజ్ కాగా ఇక్కడ ఈ సినిమాకి వస్తున్న ఆదరణ నేషనల్ వైడ్ సినిమా దగ్గర హాట్ టాపిక్ గా మారాయి.

ఇండియాలో ఈ సినిమాకి వచ్చిన గ్రాస్ లో చాలా వరకు మన తెలుగు నుంచే వస్తున్నట్లు కూడా ట్రేడ్ వర్గాలలో వినిపిస్తుంది. కథాక‌థ‌నాలు, నిడివి విష‌యంలో అక్కడక్కడా విమ‌ర్శ‌లు వినిపిస్తున్నా.. మ‌నం పెట్టే టికెట్ డ‌బ్బుల‌కు గిట్టుబాటు అవుతుంద‌నే అభిప్రాయం ప్రేక్ష‌కుల నుంచి వినిపిస్తుంది. కాగా.. ఈ సినిమాను ఒక ఇండియ‌న్ మూవీతో పోలుస్తూ సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు.

తెలుగులో వెంకటేష్ తో నార‌ప్ప‌గా రీమేక్ అయిన ధనుష్ త‌మిళ చిత్రం అసుర‌న్ క‌థ‌తో అవ‌తార్-2 స్టోరీకి చాలా పోలిక‌లు ఉన్నాయంటున్నారు. త‌న కుటుంబాన్ని కాపాడుకోవ‌డానికి ఎంత దూర‌మైనా వెళ్లే ఒక తండ్రి క‌థ‌ అసురన్ సినిమా. ఈ సినిమాలో శ‌త్రువుల దాడిలో ఒక కొడుకును కోల్పోయిన తండ్రి.. మిగ‌తా కుటుంబాన్ని కాపాడుకోవ‌డానికి హీరో శ‌త్రువులతో పోరాడ‌తాడు. అవ‌తార్-2 క‌థ కూడా అదే. అందుకే అవతార్ దర్శకుడు మన అసురన్ సినిమా చూసి కాపీ కొట్టాడని సోషల్ మీడియాలో ఫన్నీగా పోస్టులు పెడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News