Yellamma Update: యూత్ స్టార్ నితిన్ (Nithiin) వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన విజయం దక్కడం లేదు. ఎప్పుడో 2020లో వచ్చిన భీష్మ (Bheeshma) చిత్రం తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్ హిట్ అనేది నితిన్ ఖాతాలో చేరలేదు. చెక్, రంగ్ దే, మాచర్ల నియోజకవర్గం లాంటి సినిమాలు నితిన్‌ని తీవ్రంగా నిరాశపరిచాయి. ఈ ఏడాది (2025) ఆల్రెడీ రెండు సినిమాలతో వచ్చిన నితిన్‌కి సక్సెస్ దక్కలేదు.
వెంకీ కుడుముల దర్శకత్వంలో చేసిన రాబిన్ హుడ్ మీద నితిన్ చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు. కానీ, నితిన్ కి ఈ సినిమా షాకిచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ మూవీగా నిలిచింది. ఇక రీసెంట్ గా పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ టైటిల్ తమ్ముడు పెట్టుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నితిన్. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై చతికిలపడింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వకీల్ సాబ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందించిన తమ్ముడు చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. ఇలా వరుసగా ఫ్లాప్స్ చూస్తున్న నితిన్ ఇకపై హిట్ కొట్టేలా ఫ్యూచర్ ప్లాన్స్ చేసుకుంటున్నాడు.
Also Read- Jr NTR: ఎన్టీఆర్ లుక్‌పై ట్రోలింగ్.. టెన్షన్‌లో ఫ్యాన్స్
అయితే నితిన్ మాత్రం నిర్మాత దిల్ రాజు (Dil Raju) పైనే నమ్మకం పెట్టుకున్నాడు. అందులో భాగంగా మరోసారి దిల్ రాజుతో చేతుల కలిపి ఆయన నిర్మాణంలోనే బలగం మూవీతో సూపర్ హిట్ అందుకున్న నటుడు కం దర్శకుడు వేణు ఎల్దండితో ఎల్లమ్మ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతోంది. కీర్తి సురేశ్ (Keerthy Suresh) హీరోయిన్‌గా నటించబోతుంది. అయితే ఇలా వరుస ఫ్లాప్స్‌తో ఉన్న నితిన్ కి తమ్ముడు (Thammudu) కూడా డిజప్పాయింట్ చేయడంతో.. ఈ ఎఫెక్ట్ ఎల్లమ్మ (Yellamma) సినిమాపై కూడా పడిందని నెట్టింట ప్రచారం జరిగింది. అందుకే, స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.
అయితే, తాజాగా మరో వార్త కూడా చక్కర్లు కొడుతోంది. నితిన్ ఈ సినిమాకి రెమ్యునరేషన్ తీసుకోకుండా చేస్తున్నారట. సినిమా హిట్ అయి లాభాలు వస్తే అందులో వాటా తీసుకునే పద్ధతిలో ఎల్లమ్మ మూవీని కమిటైనట్టుగా ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. ఇది కొంతవరకు నితిన్ చేస్తున్న రిస్కే అనుకోవచ్చు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి చిత్రీకరణ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Also Read- K-RAMP: కిరణ్ అబ్బవరం ‘K-ర్యాంప్’ గ్లింప్స్.. ఇదెక్కడి లెక్క.. బూతులు మాట్లాడితే హిట్ వస్తుందా!


