Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభDil Raju: దిల్ రాజుకు వీళ్ళు నచ్చడం లేదా..?

Dil Raju: దిల్ రాజుకు వీళ్ళు నచ్చడం లేదా..?

Dil Raju: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులర్ అయిన విజయ్ దేవరకొండకి హిట్ దక్కి చాలాకాలం అవుతోంది. పెళ్లి చూపులు, గీత గోవిందం, టాక్సీవాలా లాంటి సినిమాల సక్సెస్ తో ఒక రేంజ్ క్రేజ్ వస్తే, అర్జున్ రెడ్డి సినిమాతో వచ్చిన క్రేజ్ ఏ ఒక్కరూ ఊహించనిది. అయితే, అర్జున్ రెడ్డి సినిమా తర్వాత నుంచి విజయ్ దేవరకొండ మీద దాని ప్రభావమే ఎక్కువగా ఉంది. ఫ్యాన్స్ లోనూ అలాంటి సినిమాలే చేయాలని కోరుకున్నారు. కానీ, అన్నీ అర్జున్ రెడ్డి లాంటి సినిమాలే చేయాలంటే అసాధ్యం.

- Advertisement -

విజయ్ ని అన్ని రకాల అభిమానులు ఆదరిస్తున్నారు. అందుకే, గీత గోవిందం, ఖుషి, ఫ్యామిలీ స్టార్ లాంటి సినిమాలొచ్చాయి. లైగర్, డియర్ కామ్రేడ్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిల పడ్డాయి. ఇక ఇటీవల విజయ్ దేవరకొండ నుంచి కింగ్డమ్ సినిమా వచ్చింది. ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అంతకముందు దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఫ్యామిలీ స్టార్ భారీగా లాభాలను తెచ్చిపెడుతుందనుకున్నారు. ఎంతో నమ్మకంతో ఈ సినిమాను ప్రమోషన్స్ చేశారు.

Also Read- Anushka Shetty: విల‌న్ పాత్ర‌ల‌పై మ‌న‌సుప‌డ్డ అనుష్క – నాలోని ఆ యాంగిల్ చూపించాల‌నుందంటూ కామెంట్స్‌

కానీ, దిల్ రాజుకి ఫ్యామిలీ స్టార్ పెద్ద షాకిచ్చింది. హీరోయిన్ గా అప్పటి వరకూ మృణాల్ ఠాకూర్ కి తెలుగులో సీతారామం, హాయ్ నాన్న లాంటి సినిమాలతో మంచి హిట్స్ ఉన్నాయి. కానీ, హ్యాట్రిక్ దక్కుతుందనుకున్న ది ఫ్యామిలీ స్టార్ మాత్రం ఈ బ్యూటీకి షాకిచ్చింది. ఇక దిల్ రాజు బ్యానర్ లోనే విజయ్ దేవరకొండ మరో సినిమా చేస్తున్నాడు. రౌడీ జనార్ధన్ అనే పేరుతో ఈ పాటికే సెట్స్‌పైకి రావాల్సింది. కానీ, కథలో మళ్ళీ మార్పులు చేర్పులు చేస్తున్నారట. ఒక్కసారి కథ స్క్రీన్ ప్లే లాకయ్యాక దిల్ రాజు సెట్స్ పైకి వెళ్ళిపోయేవారు. కానీ, ఈ మధ్య ఆయనకి సంస్థలో నిర్మించిన సినిమాలు తీవ్రంగా నష్టాలను మిగిల్చాయి.

దాంతో ఇప్పుడు రౌడీ జనార్ధన్ కథలో పలు మార్పులు చేస్తున్నట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇదే కాదు, బలగం వేణు దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించాల్సిన ఎల్లమ్మ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కూడా ఎప్పుడో సెట్స్ మీదకి రావాల్సి ఉంది. కానీ, నితిన్ కి గతకొంతకాలంగా వరుస ఫ్లాప్స్ రావడం వల్ల ఇప్పుడు ఎల్లమ్మ స్క్రిప్ట్ లో కూడా దిల్ రాజు కొన్ని మార్పులు చేర్పులు చెప్పారట. ఈ రెండు ప్రాజెక్ట్స్ విషయంలో దిల్ రాజు బాగా ఆలోచిస్తున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.

Also Read- Late sleep : ఆలస్య నిద్ర.. ఆరోగ్యానికి చిద్రం! యువతను పట్టి పీడిస్తున్న కొత్త సిండ్రోమ్!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad