Pawan Kalyan – Dil Raju: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు అదిరిపోయే స్క్రిప్ట్ లాక్ చేసినట్టుగా తాజా వార్త ఒకటి సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతోంది. ‘హరి హర వీరమల్లు’ లాంటి సోషియో ఫాంటసీ మూవీ తర్వాత కంప్లీట్ డిఫరెంట్ జానర్ లో వచ్చిన సినిమా OG. చాలా ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ గా నటించి ఆకట్టుకున్నారు. సుజీత్ దర్శకత్వంలో వచ్చిన OG బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ సక్సెస్ ని అందుకుంది.
ఇక పవన్ కళ్యాణ్ నుంచి రావాల్సిన సినిమా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ఒక్కటే అని అందరూ అనుకున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కూడా ఇలాగే ఉన్నాయి. కానీ, OG సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు చేస్తాననే కామెంట్స్ అందరికీ ఉత్సాహాన్నిచ్చాయి. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ మూవీ షూటింగ్ ఈ నవంబర్ కి కంప్లీట్ అవుతుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Also Read – AA22A6: అల్లు అర్జున్, అట్లీ మూవీపై బాలీవుడ్ హీరో సెన్షేషనల్ కామెంట్స్..
అయితే, టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు పవన్ కళ్యాణ్ కోసం రెండు కథలని ఫైనల్ చేసినట్టుగా లేటెస్ట్ న్యూస్. వాటిలో ఒకటి ఆల్రెడీ లాక్ అయిందట. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది. అంతేకాదు, ఇందులో పవన్ కళ్యాణ్ పాత్ర ‘మాస్టారు’ అని సమాచారం. ఇప్పటికే, దిల్ రాజుకి అనిల్ రావిపూడి ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి 5 బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు.
ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమాను చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న ఈ సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. దీని తర్వాత పవన్ కళ్యాణ్, అనిల్ రావిపూడి, దిల్ రాజు కాంబోలో సినిమా మొదలవబోతుందని తెలుస్తోంది. త్వరలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. ఇక, పవన్ కళ్యాణ్, దిల్ రాజు కాంబోలో వచ్చిన ‘వకీల్ సాబ్’ భారీ హిట్ సాధించిన సంగతి తెలిసిందే.
Also Read – Sharwanand: బైక్ రేసర్‌గా శర్వానంద్ – ఎట్టకేలకు టైటిల్ రివీల్ చేసిన యూవీ క్రియేషన్స్…


