సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(TFDC) చైర్మన్, నిర్మాత దిల్ రాజు(Dil Raju) పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అవసరమైతే రేవతి భర్త భాస్కర్‌కు ఫిల్మ్ ఇండస్ట్రీలో పర్మినెంట్ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రేవతి కూతురు భవిష్యత్ బాధ్యతను తాము తీసుకుంటామని ప్రకటించారు.
సీఎం రేవంత్ రెడ్డిని రెండు రోజుల్లో కలుస్తానని తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని.. ఇలాంటి ఘటనలు జరగాలని ఎవరూ కోరుకోరని తెలిపారు. ప్రజలకు మీడియా వాస్తవాలు చూపించాలని కోరారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు త్వరలోనే ఫుల్‌స్టాప్ పెడదామన్నారు. సినీ పరిశ్రమ ప్రముఖులతో పాటు ప్రభుత్వ పెద్దలను కలిసి షరిష్కారం చూపే ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమ, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటానని ఆయన వెల్లడించారు.