Chiranjeevi Bobby Movie Details: మెగాస్టార్ చిరంజీవి 158వ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది. యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చిరంజీవి నెక్ట్స్ సినిమా తెరకెక్కనుంది. వీరిద్దరూ ఇప్పటికే కలిసి చేసిన సినిమా వాల్తేరు వీరయ్య.. బ్లాక్ బస్టర్ హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే. మరోసారి ఈ మాస్ కాంబోలో మూవీ రానుంది. అయితే ఈసారి మెగాస్టార్‌ను మరింత రా అండ్ మాస్ లుక్‌లో చూపించటానికి బాబీ సిద్ధమయ్యాడని అనౌన్స్‌మెంట్ పోస్టర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా మెగా 158 మూవీ అఫిషియల్ ప్రకటన వచ్చేసింది.
మెగా 158 అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను గమనిస్తే.. గోడకు పదునైన గొడ్డలి గుచ్చుకుని ఉంది. దానికి అంటిన రక్తం గోడ పగుళ్ల నుంచి కారుతుంది. అంటే ఈసారి చిరంజీవిని మరింత మాస్ అవతార్‌లో చూపించబోతున్నట్లు దర్శకుడు బాబీ చెప్పకనే చెప్పేశాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆసక్తికరమైన మరో విషయమేమంటే ప్రముఖ నిర్మాణ సంస్థ కె.వి.ఎన్.ప్రొడక్షన్స్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. వెంకట్ కె.నారాయణ, లోహిత్ ఎన్.కె నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.
Also Read – Andhra King Taluka: రిలీజ్ డేట్ వచ్చేసింది.
వాల్తేరు వీరయ్య తర్వాత…
ఇది వరకు వాల్తేరు వీరయ్యలాంటి మాస్ మూవీ చేసి చిరంజీవికి రీ ఎంట్రీ తర్వాత బ్లాక్ బస్టర్‌ని అందించాడు దర్శకుడు బాబీ. ఆ సినిమాలో వింటేజ్ చిరంజీవిని చూపించి కామెడీతో పాటు కమర్షియల్ అంశాలను చూపించాడు. చిరంజీవి తమ్ముడిగా ఇందులో రవితేజ నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి బాబీ చిరుని ఎలా చూపించబోతున్నాడనేది ఇంట్రెస్టింగ్‌గా ఉంది.
నిజానికి ఈ సినిమా కంటే ముందే శ్రీకాంత్ ఓదెల సినిమా తెరకెక్కాల్సింది. కానీ.. నానితో ఈ దర్శకుడు చేస్తోన్న ప్యారడైజ్ మూవీ చిత్రీకరణ ఇంకా పూర్తి కాలేదు. దాని తర్వాతే చిరంజీవితో సినిమా ఉంటుంది. దీనికి ఇంకా సమయం ఉండటంతో మెగాస్టార్ వెంటనే బాబీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇప్పటికే విశ్వంభరను పూర్తి చేసిన చిరంజీవి మరో రెండు, మూడు నెలల్లో మన శంకర వరప్రసాద్‌గారు మూవీని కూడా కంప్లీట్ చేసేస్తాడు. తర్వాత బాబీ సినిమాను ట్రాక్ ఎక్కించేయబోతున్నాడు మెగాస్టార్.
మెగా అప్‌డేట్స్…
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే విశ్వంభర గ్లింప్స్.. మన శంకర వరప్రసాద్‌గారు మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజయ్యాయి. తాజాగా బాబీ మూవీకి సంబంధించిన ప్రకటన కూడా వచ్చేయటంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ మూడు సినిమాలో ముందుగా చిరంజీవి, అనీల్ రావిపూడి మూవీ మన శంకరవరప్రసాద్‌గారు వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుండగా, విశ్వంభర వచ్చే వేసవిలో సందడి చేయనుంది.
Also Read – Ram Charan: నా హీరో మీరే – తండ్రికి రామ్‌చరణ్ ఎమోషనల్ బర్త్‌డే విషెస్ – వీడియోతో స్వీట్ సర్‌ప్రైజ్


