Peddi Update: టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ‘ఉప్పెన’ ఒకటి. ఈ సినిమా రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమాతో బుచ్చిబాబు అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు ఏకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో పెద్ది వంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. రీసెంట్‌గా జరిగిన ‘డ్యూడ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన బుచ్చిబాబు పెద్ది గురించి అప్‌డేట్ ఇవ్వటమే కాకుండా తన తొలి సినిమా మేకింగ్ విషయంలో బడ్జెట్ పరంగా నిర్మాతల నుంచి వచ్చిన సహకారాన్ని కూడా చెప్పారు.
‘‘నేను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో రంగస్థలం సినిమాకు సుకుమార్ సార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా నా జర్నీని స్టార్ట్ చేశాను. అదే బ్యానర్‌లోనే ఉప్పెన సినిమాతో డైరెక్టర్‌గా మారాను. నేను ముందు చూసినప్పుడు నవీన్‌గారు, రవిగారు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ‘ఉప్పెన’ సినిమా చేస్తున్నప్పుడు నేనెవరో తెలియదు, వైష్ణవ్, కృతి ఎవరో తెలియదు. నమ్మకంతో సినిమా చేశారు. మంచి కథలను ఎంచుకోవటంలో వారెప్పుడూ ముందుంటారు. ఉప్పెన షూటింగ్ జరుగుతున్నప్పుడు నాకోసారి నవీన్‌గారు ఫోన్ చేశారు. ‘నీకు అర్థమవుతుందా ఇప్పటికే సినిమా బడ్జెట్ రూ.20 కోట్లు అయ్యింది’ అన్నారు. ‘అవునా సర్’ అని నేను అన్నాను. అంతే ఇంకేం మాట్లాడలేదు’’ అన్నారు.
Also Read- Lavanya Tripathi: ఓటీటీలోకి మెగా కోడలి తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ – తెలుగులోనూ రిలీజ్
ఇదే సందర్భంలో పెద్ది గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ మధ్య అన్నీ ఎ.ఆర్.రెహమాన్‌గారి పాటలనే వింటున్నాను. రీసెంట్‌గా నా ప్లే లిస్ట్ చూసిన రామ్ చరణ్‌గారు ‘ఏంట్రా అన్నీ రెహమాన్‌గారి సాంగ్సే ఉన్నాయి’ అన్నారు. ఏడాదిన్నరగా ఆయన పాటలు తప్ప ఎవరి పాటలు వినటం లేదని ఆయనకు చెప్పాను. నెక్ట్స్ పెద్ది సినిమా సాంగ్ రాబోతోంది. రెహమాన్‌గారు ఇరగొట్టేశారు. ఫస్ట్ లవ్ సాంగ్ వస్తుంది’’ అన్నారు.
‘పెద్ది’ సినిమా నుంచి ముందు ఫస్ట్ షాట్ వచ్చింది. రీసెంట్‌గా గ్లింప్స్ రిలీజ్ చేశారు. నెక్ట్స్ లవ్ సాంగ్ రాబోతుంది. రీసెంట్‌గానే ఆ పాటను చిత్రీకరించారు. అయితే పాట ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది మాత్రం చెప్పలేదు. మరో వైపు బుచ్చిబాబు డెబ్యూ ఫిల్మ్ ఉప్పెన సినిమాకు అనుకున్న బడ్జెట్ వేరు.. ఖర్చు పెట్టిన బడ్జెట్ వేరు. ఇరవై కోట్లు కూడా ఖర్చు పెట్టాలనుకోలేదు. కానీ చేశారు. అయితే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావటంతో వంద కోట్ల మూవీగా నిలిచింది. వైష్ణవ్, కృతి శెట్టి, బుచ్చిబాబు కెరీర్‌లను మలుపు తిప్పేసింది.
Also Read- Mithra Mandali Review: ‘మిత్ర మండలి’ సినిమా రివ్యూ అండ్ రేటింగ్


