Rajamouli Movies: ఇండియన్ సినిమా అంటే కేరాఫ్ టాలీవుడ్ అనే పరిస్థితికి వచ్చింది. అయితే తెలుుగు సినిమాకు ఇంత బేస్ రావటానికి కారణం మాత్రం.. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి అనటంలో సందేహం లేదు. ఆయన బాటలో ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ చేస్తూ డైరెక్టర్స్ హిట్స్ కొడుతున్నారు. ఇప్పుడైతే కొందరు దర్శకులు ఏకంగా రాజమౌళికే గట్టిపోటీనిస్తున్నారు. ఇంతకీ ఎవరా దర్శకులు.. ఏంటా సినిమాలనే వివరాలపై ఓ లుక్కేద్దాం…
‘బాహుబలి’, ‘ఆర్ ఆర్ ఆర్’ లాంటి చిత్రాలతో రాజమౌళి పాన్ ఇండియాలో ఓ బ్రాండ్ గా మారారు. ఇప్పుడు ఏ డైరెక్టర్ పాన్ ఇండియా సినిమా తీసినా? రాజమౌళి స్పూర్తితోనే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రాజమౌళితోనే సినిమాలు చేయడానికి దేశంలో ఉన్న టాప్ స్టార్లే క్యూలో ఉన్నారు. అంతకు మించి రాజమౌ ళి గ్రేట్ అని చెప్పడానికి మరో సర్టిఫికెట్ అవసరం లేదు. రాజమౌళి తర్వాత సుకుమార్, ప్రశాంత్ వర్మ, ప్రశాంత్ నీల్, చందు మొండేటి, సందీప్ రెడ్డి వంగా ఇలా చాలా మంది దర్శకులు పాన్ ఇండియా సినిమాలు తీసి సక్సెస్ కొట్టారు.
Also Read – Bigg Boss: ఉహకందని మార్పులు.. ఊహించని ట్విస్టులు.. బిగ్ బాస్ ప్రోమో రిలీజ్
ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో భారీ సినిమాలు తీస్తోన్న దర్శకుల్లో స్పూర్తి నింపింది ఎవరు? అంటే అంతా గంటా పథంగా చెప్పే పేరు రాజమౌళి. మేము కూడా మీ రూట్లోనే అంటూ జక్కన్నను కీర్తించిన వారెంతో మంది. తాజాగా ఈ నయా డైరెక్టర్లు అంతా రాజమౌళికి పోటీగా రెడీ అవుతున్నారు? అన్నది అంతే వాస్తవం. భవిష్యత్ లో గట్టి పోటీ నిచ్చేది కూడా వాళ్లే. ప్రస్తుతం బాలీవుడ్ లో నితీష్ తీవారీ రామాయణం తెరకెక్కిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్నచిత్రమిది. భారీ వార్ సన్నివేశాలతో బాహుబలిని మించిన సినిమా అవుతందని అంచనాలు తెరపైకి వస్తున్నాయి.
నితీష్ గ్రేట్ మేకింగ్ తో ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. బాహుబలి కి ఈ సినిమా మంచి పోటీని స్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలోనూ ఇతి హాసాల మీద కొన్నిసినిమలొచ్చినా? తాజా రామాయణంపై బజ్ మాత్రం దేశ వ్యాప్తంగా భారీగా ఉంది. హిందుత్వం కాన్సెప్ట్ జనాల్లోకి బలంగా వెళ్లడం కీలకంగా మారింది. అలాగే బన్నీతో అట్లీ తెరకెక్కిస్తోన్న చిత్రాన్ని కూడా జక్కన్నకు పోటీగా పోలిక చేస్తున్నారు. ఇది భారీ టెక్నికల్ స్టాండర్స్డ్ ఉన్నచిత్రం కావడంతో ఈ రేసులో నిలిచింది.
ప్రఖ్యాత హాలీవుడ్ స్టూడియోలను రంగంలోకి దించడం.. బన్నీ పాత్రకు సంబంధించిన లుక్ టెస్ట్ వంటి అంశాలు సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చాయి. దీంతో ఈ చిత్రాన్ని అట్లీ ఎలా తీస్తాడు? అన్నటెన్షన్ ఓ సెక్షన్లో బలంగా ఉంది. సందీప్ రెడ్డి వంగా స్పిరిట్, నాగ వంశీ కల్కి 2 వంటి చిత్రాలు ఎస్ ఎస్ ఎం బీ 29కి ధీటుగా ఉంటాయి? అన్న విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. మరి ఈ పోరులో ఆడియెన్స్‌ను వావ్ అనిపించబోయెదెవరనేది మాత్రం తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.


