Fauji: ఎట్టకేలకు డైరెక్టర్ హను రాఘవపూడి ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పేశాడు. అప్పుడెప్పుడో ‘ఫౌజీ’ సినిమాను లాంఛనంగా స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్స్ లేవు. దీనిపై ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారనటంలో సందేహం లేదు. ఈ నిరీక్షణకు ఇప్పుడు తెరపడిందనే చెప్పాలి. ‘డ్యూడ్’ సినిమాకు గెస్ట్‌గా విచ్చేసిన హను రాఘవపూడి ‘ఫౌజీ’ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ వస్తుందనే దానిపై క్లారిటీ ఇచ్చేశారు.
హను రాఘవపూడి ముందుగా ‘డ్యూడ్’ యూనిట్‌ను అభినందించారు. ‘‘మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు ‘డ్యూడ్’ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారని ముందు నాకు తెలియదు. ఆ సినిమా నుంచి విడుదలైన బూమ్ బూమ్ సాంగ్ చూడగానే వైబ్ వచ్చింది. ‘ప్రేమ దేశం’ సినిమాలో ‘ముస్తాఫా ముస్తాఫా’ సాంగ్.. ప్రేమికుడులో ‘ఊర్వశి ఊర్వశి..’ సాంగ్‌లను చూసినప్పుడు ఎలా అనిపించిందో బూమ్ బూమ్ సాంగ్ చూసినప్పుడు అలా అనిపించింది. ప్రదీప్, మమితా బైజు మధ్య కెమిస్ట్రీ అద్భుతం’’ అన్నారు. అదే సమయంలో ‘ఫౌజీ’ సినిమా అప్‌డేట్ ఏంటని ఫ్యాన్స్ గోల చేశారు. దానికి ఆయన మాట్లాడుతూ ‘‘తప్పకుండా ఈ నెలలో టైటిల్ అనౌన్స్ చేస్తాం. అది ఫౌజీనా కాదా? అని కూడా తెలుస్తుంది’’ అన్నారు. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే. కాబట్టి ఆ రోజున ప్రభాస్, హను రాఘవపూడి మూవీకి సంబంధించిన అప్‌డేట్ వచ్చేయటం ఫిక్స్. ఇప్పటి వరకు క్లారిటీ లేని అభిమానులకు డైరెక్టర్ భరోసాతో నమ్మకం వచ్చేసింది. అభిమానులు ఆనందానికి ఈ మూవీ టైటిల్ అనౌన్స్‌మెంట్ అనేది ఎక్స్‌ట్రా ఎనర్జీనిస్తుందనటంలో సందేహం లేదు.
‘సీతారామం’తో సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ కొట్టిన హను రాఘవపూడికి ప్రభాస్ ఛాన్స్ ఇచ్చాడు. మైత్రీ మూవీ మేకర్స్ వంటి సంస్థ అండ దొరకటంతో ‘ఫౌజీ’ సినిమా ట్రాక్ ఎక్కేసింది. ఇప్పటికే సినిమా చిత్రీకరణ చాలా వరకు పూర్తి చేసుకుంది. ఈ మూవీలో ప్రభాస్ సరసన ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాశ్మీర్‌లో జరిగిన గొడవలు, అక్కడ ఓ కుటుంబాన్ని కాపాడటానికి ‘ఫౌజీ’గా ఉండే హీరో ఏం చేశాడనేదే కథ. ఇదొక పీరియాడిక్ లవ్ స్టోరీగా మన ముందుకు రానుంది.
‘ఫౌజీ’ సినిమాను వచ్చే ఏడాది ఆగస్ట్ 14న రిలీజ్ చేయటానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత హోంబలే బ్యానర్‌లో ప్రభాస్‌తో హను రాఘవపూడి సినిమా ఉంటుందనే టాక్ కూడా వస్తోంది. హను రాఘవపూడి పీరియాడిక్ లవ్‌స్టోరీలో ప్రభాస్‌ను ఎలా చూపిస్తారోననేది కూడా అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది.
Also Read – Bigg Boss Thanuja: బిగ్‌బాస్ తనూజ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. పది నెలల తర్వాత ఓటీటీలోకి..


