Fauzi Story: ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఫౌజీ’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవి శంకర్ సినిమాను నిర్మిస్తున్నారు. ‘ది రాజా సాబ్’ మూవీ చేస్తున్నప్పుడు ‘స్పిరిట్’ అనౌన్స్ అయ్యింది. ఆ సినిమా సెట్స్ పైకి వెళుతుందని అందరూ భావిస్తే.. ఎవరూ ఊహించని రీతిలో ‘ఫౌజీ’ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. స్పిరిట్ సినిమాను ఆపి మరీ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లటం అందరినీ ఆశ్చర్యపరిచింది. సినిమాను సైలెంట్‌గా కంప్లీట్ చేస్తూ వచ్చారు. ఇప్పటికే సినిమా 50 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయ్యింది.
రీసెంట్‌గా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్‌ను ‘ఫౌజీ’గా అనౌన్స్ చేశారు. ఓ బెటాలియన్ వ్యక్తి రూపంలో నడిస్తే .. ఎలా ఉంటుందనే లైన్‌ను రివీల్ చేయటం ద్వారా ప్రభాస్ పాత్రలోని పవర్‌ఫుల్‌నెస్‌ను రివీల్ చేశారు మేకర్స్. అసలు ఫౌజీ కథేంటి.. కథకు మూలమేంటి? అనేది నిన్న మొన్నటి వరకు ఎక్కడా రివీల్ కాలేదు. అయితే తాజాగా దర్శకుడు హను రాఘవపూడి తను సినిమా కథను తయారు చేయటానికి మూలమేంటి? అనే విషయాన్ని రివీల్ చేశాడు. హను చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ‘ఫౌజీ’ కథకు మహాభారతం మూలం. భూమి కోసం పాండవులు, కౌరవులు మధ్య యుద్ధం జరిగింది. అందులో జన్మతః కౌంతేయుడైన కర్ణుడు స్నేహం కోసం కౌరవుల పక్షాన పోరాటం చేశాడు. అదే ఆయన పాండవుల పక్షాన యుద్ధం చేసుంటే ఎలా ఉండేది.. అనే పాయింట్‌ను ఆలోచించి హను రాఘవపూడి ‘ఫౌజీ’ కథను రాశాడు.
Also Read- Pooja Hegde: అప్పుడు హీరోయిన్ – ఇప్పుడు ఐటెంసాంగ్ – అల్లు అర్జున్ సినిమాలో పూజా హెగ్డే?
ఇక్కడ ప్రస్తావించాల్సిందేంటంటే మరోసారి కర్ణుడి పాత్రను ఆధారంగా చేసుకుని ‘ఫౌజీ’లో ప్రభాస్ రోల్‌ను డిజైన్ చేశాడు డైరెక్టర్. అంటే ధర్మ పక్షాన కర్ణుడు యుద్ధం చేస్తే ఎలా ఉంటుందనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. ప్రభాస్ సరసన ఇందులో ఇమాన్వి నటిస్తోంది. 1947 నాటి బ్యాక్ డ్రాప్‌లో నడిచే కథ. ఇందులో ఆర్మీ ఆఫీసర్‌గా డార్లింగ్ కనిపించబోతున్నారు. ఇలాంటి క్యారెక్టర్‌లో ప్రభాస్ కనిపించనుండటం ఇదే తొలిసారి. వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమాను విడుదల చేయటానికి మేకర్స్ ప్లానింగ్ చేస్తున్నారు. సీతారామం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న సినిమా ఇది.
మరో వైపు.. వచ్చే ఏడాది ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తోన్న ది రాజా సాబ్ సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రిలీజ్ కాబోతోంది. సందీప్ వంగా చేయబోతున్న స్పిరిట్ మూవీని ఇదే ఏడాది సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారు.
Also Read- Peddi: ఛలో శ్రీలంక – జాన్వీకపూర్‌తో రొమాంటిక్ డ్యూయెట్‌కు రామ్‌చరణ్ రెడీ


