Phanindra Narsetti: ఓ సినిమా విజయవంతమైందంటే, దాని సక్సెస్ మీట్‌కు దర్శకుడు, నిర్మాతల హాజరు సాధారణమే. కానీ ‘8 వసంతాలు’ అనే చిత్రానికి జరిగిన సక్సెస్ మీట్‌కి వచ్చిన మీడియాకు మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితులు కనిపించాయి. సక్సెస్‌మీట్ అంటూ నిర్వహించిన ఈవెంట్లో చిత్ర దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి కనిపించకపోవడం ఒకటైతే, నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ఒక్కరెవరూ హాజరు కాకపోవడం అందరికీ ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించింది. నిజంగానే సక్సెస్ మీట్‌కే వచ్చామా? అని మీడియా అనుకుంటే, దీనిపై సోషల్ మీడియాలో కూడా చర్చ జరిగింది.
‘8 వసంతాలు’ మూవీ ప్రమోషన్లో భాగంగా ఫణీంద్ర నర్సెట్టి చేసిన కొన్ని వ్యాఖ్యలు గత కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా మారాయి. ‘మణిరత్నం సినిమాలను విమర్శించే అర్హత మనకు ఉందా?” అనే ప్రశ్న,‘పది నిమిషాలపాటు పెన్ పక్కన పెట్టినా, ఓ మాస్ కమర్షియల్ స్క్రిప్ట్ రాయగలను’ అని చేసిన వ్యాఖ్యలతో ఆడియన్స్‌ను గట్టిగానే హర్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలే ఆయన సినిమాకు కొంత నెగటివ్ బజ్ తెచ్చినట్టు సినీ వర్గాల్లో వినిపిస్తోంది.
‘8 వసంతాలు’ సినిమాపై టీమ్ చాలా నమ్మకాలే పెట్టుకుంది. అయితే సినిమాకు మాతరం మిక్స్డ్ టాకే వచ్చింది. అయితే మ్యూజిక్, సినిమాటోగ్రఫీకి బావున్నాయని అందరూ ప్రశంసిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సోమవారం జరిగిన సక్సెస్ ఈవెంట్ మరింత గందరగోళాన్ని తెచ్చిపెట్టింది. అందుకు కారణం.. ఈవెంట్‌కు దర్శకుడు ఫణీంద్ర గైర్హాజరు కావడం మాత్రమే కాదు, మైత్రి సంస్థ కూడా పట్టించుకోలేదు. దీంతో ఈ సినిమా నిర్మాతలే సినిమాని పూర్తిగా వదిలేసిన ఫీలింగ్ ప్రజల్లోకి వెళ్లింది.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/director-mani-ratnam-says-sorry-about-thug-life-failure/
ఇదే క్రమంలో సక్సెస్ మీట్లో సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ మరో వివాదానికి తెరతీశారు. ‘‘8 వసంతాలు’ సినిమా ఓటీటీలో థియేటర్ కంటే చాలా బాగుంటుంది’అని అనడం, తరువాత తన తప్పును తెలుసుకుని సారీ చెప్పడం, వెంటనే డాల్బీ థియేటర్లో చూసేందుకు ప్రోత్సహించడమే కాకుండా తన మాటల్ని వెనక్కి తీసుకోవడం ఏకంగా గందరగోళానినికి కారణమైంది. ఆ తర్వాత జరిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ అవర్‌లో ఒక మీడియా ప్రతినిధి సినిమాలోని వివాదాస్పద సీన్లపై తీవ్రంగా ప్రశ్నలు సంధించారు. వారణాసిలో జరిగే ఫైట్ సీన్, అక్కడ పంతుల్ని రేపిస్ట్‌గా చూపించడం, మటన్ షాపులకి సంబంధించిన కాంట్రవర్శియల్ డైలాగ్స్, ఇవన్నీ సామాజిక స్పృహను దెబ్బతీయడమేనంటూ గట్టిగా విమర్శించారు.
మొత్తంగా చూస్తే ‘8 వసంతాలు’ సినిమా మంచి టెక్నికల్ వ్యాల్యూస్‌తో పాటు ఓ వర్గానికి ఆకట్టుకున్నా, దర్శకుడు, నిర్మాతల వ్యవహార శైలి, ప్రమోషన్లలో చేసిన వ్యాఖ్యలు, మరియు సక్సెస్ మీట్లోని అవ్యవస్థితి దీన్ని ఒక ‘గెలుపు వేడుక’ కాకుండా ఒక సందేహాస్పద సమరం గానే మార్చేశాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.