Family Man Season 3: ఇండియన్ వెబ్‌సిరీస్‌లలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ సిరీస్ ఏదంటే ఫస్ట్ వినిపించే పేరు ఫ్యామిలీ మ్యాన్. సినిమాలకు ధీటుగా ఈ స్పై థ్రిల్లర్ సిరీస్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఇండియాలోనే అత్యధిక మంది వీక్షించిన వెబ్‌సిరీస్‌లలో ఒకటిగా నిలిచింది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌సిరీస్‌కు ఇప్పటివరకు రెండు సీజన్లు వచ్చాయి. మూడో సీజన్ కూడా రాబోతుంది.
ఫ్యామిలీ మ్యాన్ ఫ్యాన్స్‌కు డైరెక్టర్ రాజ్ అండ్ డీకేతో పాటు నటుడు బాజ్‌పేయి గుడ్‌న్యూస్ వినిపించారు. ఫ్యామిలీ మ్యాన్ ఫస్ట్ సీజన్ రిలీజై నేటితో ఆరేళ్లు అవుతుంది. ఈ సందర్భంగా ఫ్యామిలీ మ్యాన్ జర్నీకి సంబంధించిన జ్ఞాపకాలను రాజ్ అండ్ డీకే షేర్ చేసుకున్నారు. మూడు సీజన్‌కు సంబంధించిన క్లాప్‌బోర్డ్ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. అంతే మనోజ్ బాజ్‌పేయి ముఖం కనిపించకుండా ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ఇందులో కెమెరాలో తన సీన్‌ను చూసుకుంటూ మనోజ్ బాజ్‌పేయి కనిపించారు. ఆరేళ్ల క్రితం రిలీజైన ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. మూడో సీజన్ ఎలా ఉంటుందో ఊహించుకొండిఅంటూ మనోజ్ బాయ్‌పేయి కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు.
Also Read – Bigg Boss Elimination: ప్రియా సేఫ్.. మర్యాద మనీష్ ఔట్.. షాకింగ్ గా సెకండ్ వీక్ ఎలిమినేషన్
నవంబర్‌లో రిలీజ్…
ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. నవంబర్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కానున్నట్లు సమాచారం.
సర్‌ప్రైజింగ్ రోల్‌లో సమంత…
కాగా ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3లో పాతాల్ లోక్ వెబ్ సిరీస్ ఫేమ్ జై దీప్ అహ్లవత్ విలన్‌గా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అతడితో పాటు సమంత కూడా ఓ ఇంట్రెస్టింగ్ రోల్‌లో కనిపించనున్నట్లు సమాచారం. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో సమంత విలన్‌గా నటించింది. సీజన్ 3లో సమంత రోల్ చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందట.
రాజ్ నిడిమోరుతో ప్రేమాయణం…
ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 షూటింగ్ కంప్లీట్ అయిన సందర్భంగా యాక్టర్స్, టెక్నీషియన్లు అందరూ ఓ స్పెషల్ పార్టీ చేసుకున్నారు. ఈ ఈవెంట్‌లో సమంత కూడా సందడి చేసింది. సీజన్ 3లో సమంత నటించింది కాబట్టే ఈ పార్టీకి అటెండ్ అయ్యిందని చెబుతున్నారు. మరోవైపు ఫ్యామిలీ మ్యాన్ దర్శకద్వయంలో ఒకరైన రాజ్ నిడిమోరుతో సమంత ప్రేమలో ఉన్నట్లుగా కొన్నాళ్లుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. వీరిద్దరు ఫారిన్ ట్రిప్పులకు వెళ్లిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తమ మధ్య ఉన్న బంధాన్ని గురించి సమంతతో పాటు రాజ్ నిడిమోరు ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు.
ప్రస్తుతం రాజ్ అండ్ డీకే దర్శకత్వంలోనే రూపొందుతోన్న హిందీ వెబ్ సిరీస్ రక్త బ్రహ్మాండ్‌లో సమంత లీడ్ రోల్‌లో నటిస్తోంది.


