RGV Suggests Mega Power Movie: వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో మెగా ఫ్యామిలీపై స్పందించాడు. ఆర్జీవీ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా నిలిచింది. తాజాగా ఆర్జీవీ.. మెగా బ్రదర్స్‌కు ఓ అద్భుతమైన సలహ ఇస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు.
మెగా పవర్ సినిమా: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన తాజా పోస్ట్‌తో మెగా అభిమానులను ఆకర్షించాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’ విడుదలై సెప్టెంబర్ 22కు 47 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయనకు పవన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆ పోస్ట్‌ను షేర్ చేసిన ఆర్జీవీ.. చిరు, పవన్ కలిసి సినిమా తీయాలని కోరారు. ‘‘మీరిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తే అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ మెగా పవర్ జోష్ నింపుతుంది. ఆ చిత్రం ఈ శతాబ్దంలోనే మెగా పవర్ సినిమా అవుతుంది’’ అంటూ ఆర్జీవీ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ అంశంపై నెటిజన్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తే బాగుంటుందని నెటిజన్లు వారి అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో వ్యక్తం చేస్తున్నారు.
చిరంజీవి పుట్టకతోనే యోధుడు: మా పెద్దన్నయ్య ఓ ఫైటర్.. ఆయనకు రిటైర్మెంట్ లేదని పవన్ కల్యాణ్ అన్నాడు. ఇక చిరు నటించిన తొలి సినిమా విడుదలై 47 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయనకు సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అన్నయ్యపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన అభిమానాన్ని చాటుతు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన అన్నతో గడిపిన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు. చిరంజీవి పుట్టకతోనే యోధుడని పవన్ కల్యాణ్ పేర్కొన్నాడు. చిరంజీవికి రిటైర్మెంట్ ఉండదని ప్రశంసలు కురిపించాడప. అయితే పవన్ పెట్టిన పోస్ట్‌కు చిరు స్పందించాడు. తమ్ముడి మాటలు తనను పాత రోజులకు తీసుకెళ్లాయని తెలిపాడు.


