Bro Sequel: పవన్ కళ్యాణ్ బ్రో మూవీకి సీక్వెల్ కన్ఫామ్ అయ్యింది. సీక్వెల్‌పై డైరెక్టర్ సముద్రఖని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మెగా హీరోలు పవన్ కళ్యాణ్, సాయిధరమ్‌తేజ్ నటించిన బ్రో మూవీ కమర్షియల్ సక్సెస్‌గా నిలిచింది. వంద కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఫాంటసీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించాడు. త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించారు. బ్రో మూవీ కలెక్షన్స్ బాగానే వచ్చినా.. కాన్సెప్ట్ విషయంలో విమర్శలొచ్చాయి. అయినా పవన్ కళ్యాణ్ క్రేజ్ కారణంగా నిర్మాతలకు ఈ మూవీ లాభాలను తెచ్చిపెట్టింది.
Also Read- SSMB29: ఎస్ఎస్ఎంబీ29 అప్‌డేట్ – క్లైమాక్స్ షూట్‌లో మహేష్ మూవీ – గుడ్‌న్యూస్ చెప్పిన జక్కన్న
తాజాగా బ్రో మూవీకి సీక్వెల్ రాబోతుంది. ఈ విషయాన్ని డైరెక్టర్ సముద్రఖని స్వయంగా ప్రకటించాడు. కాంతా మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో పాల్గొన్న సముద్రఖని బ్రో సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. బ్రో2 స్క్రిప్ట్ రెడీగా ఉంది. పవన్ కళ్యాణ్ అంగీకరిస్తే సీక్వెల్ షూటింగ్‌ను మొదలుపెట్టడమేనని అన్నారు. సముద్రఖని కామెంట్స్‌తో అభిమానులు ఖుషి అవుతోన్నారు. బ్రో సీక్వెల్‌లో సాయిధరమ్‌తేజ్ కాకుండా మరో మెగా హీరో నటించబోతున్నాడట. రామ్‌చరణ్ నటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సీక్వెల్‌తోనే ఫస్ట్ టైమ్ బాబాయ్ అబ్బాయ్ కాంబినేషన్ సెట్ అయినట్లు చెబుతున్నారు. అదే నిజమైతే పవన్ కళ్యాణ్, రామ్‌చరణ్‌లను ఒకే సినిమాలో చూడాలనే అభిమానుల కల నెరవేరడం ఖాయమని అంటున్నారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా ఒక్కటే ఉంది. తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తిచేశారు. దాంతో బ్రో సీక్వెల్‌కు పవన్ కళ్యాణ్ ఓకే చెప్పే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే బ్రో2పై ఫుల్ క్లారిటీ రానుందని సమాచారం.
Also Read- Viral video: రన్నింగ్ బస్సులో రెచ్చిపోయిన కామాంధుడు.. యువతి ప్రైవేటు పార్ట్‌లు టచ్ చేస్తూ..
కాగా ఉస్తాద్ భగత్‌సింగ్ మూవీకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ ఫిబ్రవరి 14న విడుదల కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఉస్తాద్ భగత్‌సింగ్‌ను నిర్మిస్తోంది. ఇటీవలే ఓజీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు పవన్ కళ్యాణ్. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 300 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన తెలుగు మూవీగా నిలిచింది.


