Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభSandeep Reddy Vanga: ర‌ష్మిక మంద‌న్న‌ గ‌ర్ల్‌ఫ్రెండ్ సినిమాను రిజెక్ట్ చేసిన సందీప్ వంగా -...

Sandeep Reddy Vanga: ర‌ష్మిక మంద‌న్న‌ గ‌ర్ల్‌ఫ్రెండ్ సినిమాను రిజెక్ట్ చేసిన సందీప్ వంగా – ట్విస్ట్ ఏంటంటే?

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా… ప్ర‌స్తుతం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్‌గా కొన‌సాగుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ తెలుగు డైరెక్ట‌ర్ చేసింది మూడే సినిమాలు. కానీ పాన్ ఇండియ‌న్ రేంజ్‌లో ఫేమ‌స్ అయ్యాడు. సందీప్ రెడ్డి వంగాతో సినిమాలు చేసే ఛాన్స్ కోసం స్టార్ హీరోలు సైతం ఎదురు చూస్తున్నారంటే అతిశ‌యోక్తి కాదు.

- Advertisement -

ప్ర‌స్తుతం ప్ర‌భాస్‌తో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు సందీప్ వంగా. స్పిరిట్ షూటింగ్ ఇప్ప‌టి వ‌ర‌కు మొద‌లుకాలేదు. ఇటీవ‌ల ప్ర‌భాస్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా వాయిస్ గ్లింప్స్ రిలీజ్ చేశాడు. ప్ర‌భాస్ ముఖం చూపించ‌కుండా కేవ‌లం వాయిస్‌తోనే స్పిరిట్ మూవీ గురించి ఇండియా వైడ్‌గా సినీ ల‌వ‌ర్స్ మాట్లాడుకునేలా చేశారు సందీప్ వంగా.

డైరెక్ట‌ర్‌గానే కాకుండా సందీప్ వంగాకు యాక్ట‌ర్‌గా కూడా భారీగానే అవ‌కాశాలు వ‌స్తున్నాయ‌ట‌. యూత్ ఆడియెన్స్‌లో సందీప్ వంగాకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని కొంద‌రు డైరెక్ట‌ర్లు అత‌డి కోసం స్పెష‌ల్ క్యారెక్ట‌ర్లు రాస్తున్నార‌ట‌. అలాంటిదే ఓ క్రేజీ ఆఫ‌ర్ ఇటీవ‌ల సందీప్ వంగా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఆ ఆఫ‌ర్‌ను సందీప్ వంగా రిజెక్ట్ చేసిన‌ట్లు టాక్‌.

Also Read – Fauzi: ప్ర‌భాస్ ఫౌజీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న మ‌హేష్‌బాబు మేన‌ల్లుడు

సందీప్ వంగా రిజెక్ట్ చేసిన ఆ సినిమా ఏదో కాదు ర‌ష్మిక మంద‌న్న ది గ‌ర్ల్‌ఫ్రెండ్.. క‌థ‌ను మ‌లుపుతిప్పే ఓ గెస్ట్ రోల్‌లో సందీప్ వంగా అయితే బాగుంటుంద‌ని భావించార‌ట డైరెక్ట‌ర్ రాహుల్ ర‌వీంద్ర‌న్‌. ఆ పాత్ర కోసం సందీప్ వంగాను సంప్ర‌దించిన‌ట్లు తెలిసింది. అయితే స్పిరిట్ ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌తో బిజీగా ఉన్న సందీప్ వంగా గ‌ర్ల్‌ఫ్రెండ్ సినిమాను రిజెక్ట్ చేసిన‌ట్లు స‌మాచారం. చివ‌ర‌కు సందీప్ వంగా కోసం అనుకున్న పాత్ర‌ను సినిమా డైరెక్ట‌ర్‌ రాహుల్ ర‌వీంద్ర‌న్ చేశాడ‌ట‌. ఈ రోల్ సందీప్ వంగా చేసి ఉంటే సినిమాకు బిజినెస్ ప‌రంగా హెల్ప‌య్యి ఉండేద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. సందీప్ వంగా గ‌తంలో కేడీ, మ‌హాన‌టి సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్ట‌ర్స్‌లో క‌నిపించాడు సందీప్ వంగా.

గ‌ర్ల్‌ఫ్రెండ్ మూవీ న‌వంబ‌ర్ 7న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. దీక్షిత్ శెట్టి హీరోగా న‌టిస్తున్న ఈ మూవీలో ర‌ష్మిక మంద‌న్న‌తో పాటు అను ఇమ్మాన్యుయేల్ మ‌రో హీరోయిన్‌గా క‌నిపించ‌బోతున్న‌ది. మ‌న్మ‌థుడు 2 డిజాస్ట‌ర్ త‌ర్వాత దాదాపు ఏడేళ్ల విరామం అనంత‌రం ది గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో తిరిగి మెగాఫోన్ ప‌ట్టారు రాహుల్ ర‌వీంద్ర‌న్‌. న‌వంబ‌ర్‌లో రిలీజ్ కానున్న సినిమాల్లో ది గ‌ర్ల్‌ఫ్రెండ్‌పైనే ఎక్కువ‌గా అంచ‌నాలు నెల‌కొన్నాయి.

Also Read – Train: దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైలు ఇదే..!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad