కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ శంకర్(Shankar)కి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కొన్నేళ్లుగా ఆయన తీస్తున్న సినిమాలు డిజాస్టర్‌గా మిగిలిపోతున్నాయి. ఓవైపు సినిమాల ఫ్లాపులతో సతమతమవుతున్న శంకర్‌కు మరోవైపు ఈడీ(ED) అధికారులు భారీ షాక్ ఇచ్చారు. ఆయనకు సంబంధించిన కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేశారు.
2010లో శంకర్ తీసిన రోబో సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. అయితే ఈ సినిమా స్టోరీ తాను రాసిన ఓ బుక్ నుంచి కాపీ కొట్టారని రచయిత తమిళనాదన్ ఎగ్మోర్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘంగా విచారణ చేపట్టిన న్యాయస్థానం శంకర్‌కి సంబందించిన ఆస్తులని జప్తు చెయ్యాలని ఈడీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు రూ.10 కోట్ల 11 లక్షల ఆస్తులను అటాచ్ చేశారు. ఈ వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇక శంకర్ ఇటీవలే తెలుగులో రామ్ చరణతో ‘గేమ్ ఛేంజర్’ అనే సినిమాని తెరకెక్కించిన విషయం విధితమే. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. దాదాపుగా రూ.400 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ మూవీ కనీసం రూ.200 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. దీంతో నిర్మాత దిల్ రాజు భారీగానే నష్టపోయారు. ప్రస్తుతం ‘ఇండియన్ 3’ సినిమా తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు.