Srinu Vaitla on Balakrishna Movie: యాక్షన్ కామెడీ చిత్రాలను తెరకెక్కించడంలో తనకంటూ ఓ ప్రత్యేక శైలిని చూపించి స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు శ్రీను వైట్ల. నీకోసంతో తొలి అడుగులోనే సినీప్రియుల్ని మెప్పించి.. ఆ తర్వాత ఆనందం, వెంకీ, ఢీ, రెడీ, కింగ్, దూకుడు, బాద్‌షా.. ఇలా వరుస విజయాలతో మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, మహేశ్‌బాబు.. ఇలా టాలీవుడ్ టాప్ హీరోలతో సినిమాలు తెరకెక్కించిన ఆయన.. నటసింహం బాలకృష్ణతో మాత్రం సినిమా చేయలేకపోయారు.
Also Read: https://teluguprabha.net/cinema-news/nagarjuna-remuneration-as-host-for-bigg-boss-telugu-season-9/
భవిష్యత్ లో కచ్చితంగా..
తాజాగా బాలయ్యతో సినిమా చేయకపోవడానికి కారణమేంటన్న ప్రశ్నపై ఓ ఇంటర్వ్యూలో స్పందించారు శ్రీను వైట్ల. బాలకృష్ణపై తనకు అభిమానం ఉందని, ఒకప్పుడు ఆయనతో సినిమా చేయాల్సి ఉన్నా అది సాధ్యపడలేదని అన్నారు. భవిష్యత్తులో కచ్చితంగా తెరకెక్కిస్తా అన్నారు. బాలకృష్ణ నటించిన ప్రాణానికి ప్రాణం సినిమాతోనే అప్రెంటీస్‌గా తన కెరీర్ ప్రారంభమైందని గుర్తు చేసుకున్నారు.
Also Read: https://teluguprabha.net/cinema-news/aamir-khan-brother-faisal-khan-allegations-telugu/
శ్రీహరి లేరుగా…
ఢీ సీక్వెల్ గురించి మాట్లాడుతూ.. ఢీ సినిమాలో శ్రీహరి గారి పాత్ర ఎంతో కీలకం. ఆయన లేరు కాబట్టి మరొకరితో ఆ పాత్రను కొనసాగించలేం. అప్పట్లో సీక్వెల్ చేయాలనే ఆలోచన ఉంది. కానీ ఆపేద్దామని నిర్ణయించుకున్నా అని స్పష్టత ఇచ్చారు. అయితే ఆ మధ్య కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన శ్రీను వైట్ల.. గతేడాది ‘విశ్వం’ (గోపీచంద్ హీరో) సినిమాతో ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం పూర్తిస్థాయి కామెడీ సినిమా కథ రాస్తున్నట్టుగా తెలిపారు.


