Pushpa 3: బన్నీ ఫ్యాన్స్‌కు డైరెక్టర్ సుకుమార్ గుడ్‌న్యూస్ వినిపించాడు. పుష్ప 3 కూడా ఉందని ప్రకటించాడు. శుక్రవారం జరిగిన సైమా అవార్డ్స్ 2025 ఈవెంట్‌కు అల్లు అర్జున్‌తో పాటు డైరెక్టర్ సుకుమార్ అటెండ్ అయ్యారు. ఈ అవార్డ్స్‌లో పుష్ప 2 మూవీ సత్తా చాటింది. పుష్ప 2 మూవీకి గాను బెస్ట్ హీరోగా అల్లు అర్జున్, బెస్ట్ హీరోయిన్‌గా రష్మిక మందన్నతో పాటు ఉత్తమ దర్శకుడిగా సుకుమార్ అవార్డులను అందుకున్నారు. పుష్ప 2 సినిమాలో మ్యూజిక్‌తో అదరగొట్టిన దేవిశ్రీప్రసాద్ కూడా బెస్ట్ డైరెక్టర్‌గా అవార్డును గెలుచుకున్నాడు.
పుష్ప 3…
సైమా అవార్డ్స్ ఈవెంట్‌లో పుష్ప 3పై సుకుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. బెస్ట్ డైరెక్టర్‌గా అవార్డును అందుకునే ముందు పుష్ప 3 ఉంటుందా అని హోస్ట్‌లు సుకుమార్‌ను ప్రశ్న అడిగారు. తప్పకుండా పుష్ప 3 మూవీ చేస్తాం అంటూ హోస్ట్ ప్రశ్నకు సుకుమార్ బదులిచ్చాడు. ఈ ఆన్సర్ చెబుతున్న టైమ్‌లో స్టేజ్‌పై సుకుమార్ పక్కనే అల్లు అర్జున్ ఉన్నాడు. వారితో పాటు రష్మిక మందన్న, పుష్ప 2 ప్రొడ్యూసర్లు కూడా ఉండటంతో పుష్ప 3పై అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చినట్లేనని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read- SIIMA 2025: సైమా అవార్డ్స్ 2025లో సినీ తారల సందడి.. ‘కల్కి 2898 ఏడీ’, ‘పుష్ప2’లకు అవార్డుల పంట!
1800 కోట్లు…
గత ఏడాది డిసెంబర్‌లో రిలీజైన పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ 1800 కోట్లకుపైగా కలెక్షన్స్ దక్కించుకున్నది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధిక వసూళ్లను సాధించిన సెకండ్ మూవీగా చరిత్రను సృష్టించింది.
పుష్పరాజ్‌గా…
పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ యాక్టింగ్‌తో పాటు అతడి మ్యానరిజమ్స్, బన్నీపై తెరకెక్కించిన యాక్షన్ సీన్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. సుకుమార్ టేకింగ్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగుకు ధీటుగా హిందీలో ఈ మూవీ వసూళ్లను దక్కించుకున్నది. పుష్ప 2 హిందీ వెర్షన్ 800 కోట్లకుపైగా కలెక్షన్స్ దక్కించుకున్నది. పుష్ప 2 నార్త్‌లో అల్లు అర్జున్‌కు స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది.
Pushpa 3 Rampage will Be There For Sure ✨️🔥@alluarjun @iamRashmika pic.twitter.com/N5OoQyr4eD
— North Icons (@NorthAlluFans) September 6, 2025
అట్లీతో పాన్ ఇండియన్ మూవీ…
ప్రస్తుతం అట్లీతో ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మూవీ చేస్తున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ ఇటీవలే ముంబాయిలో ముగిసింది. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న 22వ మూవీ ఇది. ఇందులో నలుగురు హీరోయిన్లు నటిస్తున్నట్లు సమాచారం. ఓ హీరోయిన్‌గా దీపికా పదుకోణ్‌ను ఫైనల్ చేశారు.
Also Read- Poonam Bajwa: నైటీలో పిచ్చెక్కిస్తున్న పూనమ్


