Jr NTR: ఎన్టీఆర్ వార్ 2 మూవీ మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆగస్ట్ 14న హిందీతో పాటు తెలుగులో భారీ ఎత్తున ఈ స్పై యాక్షన్ మూవీ రిలీజ్ అవుతోంది. మొన్నటివరకు వార్ 2కు సంబంధించి ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోవడంతో మేకర్స్‌ను ఎన్టీఆర్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేశారు. ఆదివారం వార్ 2 తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ఎన్టీఆర్‌తో పాటు హృతిక్ రోషన్ అటెండ్ అయ్యాడు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. కాలర్ ఎగరేసి మరి హిట్టు కొట్టబోతున్నాం, బొమ్మ అదిరిపోయింది అని ఎన్టీఆర్ చెప్పడాన్ని బట్టి చూస్తుంటే అభిమానుల ఎక్స్‌పెక్టేషన్స్‌కు మించి సినిమా ఉండబోతున్నట్లు కనిపిస్తుంది.
ఎన్టీఆర్ విలన్…
కాగా ఈ స్పై యాక్షన్ మూవీతోనే ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మూవీలో ఎన్టీఆర్ విలన్‌గా కనిపించబోతున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో ఎన్టీఆర్ కనిపిస్తాడని అంటున్నారు. మరికొందరు బాలీవుడ్ వర్గాలు మాత్రం వార్ 2లో హృతిక్ విలన్ అని చెబుతున్నారు. అయితే ఈ ఇద్దరిలో హీరో ఎవరు? విలన్ ఎవరన్నది మాత్రం మేకర్స్ ఇప్పటివరకు రివీల్ చేయకుండా సస్పెన్స్‌లో పెట్టారు.
త్రివిక్రమ్ కామెంట్స్…
కాగా వార్ 2 తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ రోల్స్‌పై డైరెక్టర్ త్రివిక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వార్ 2లో ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు చెప్పాలంటూ డైరెక్టర్ అయాన్ ముఖర్జీని యాంకర్ సుమ ప్రశ్న అడిగింది. కానీ సుమ ప్రశ్నకు అయాన్ ముఖర్జీ బదులుగా త్రివిక్రమ్ రిప్లై ఇచ్చారు.
Also Read – Jagdeep Dhankhar : ధన్‌ఖడ్ ఏమయ్యారు? అమిత్ షాకు సంజయ్ రౌత్ సంచలన లేఖ!
వార్ 2 మంచి సినిమా అవుతుంది…
“హృతిక్ రోషన్‌కు సంబంధించినంత వరకు తారక్ విలన్… తారక్‌కు సంబంధించినంత వరకు హృతిక్ విలన్.. హీరో విలన్ అనే పట్టింపులు లేకుండా వార్ 2 మాత్రం మంచి సినిమా అవుతుంది” అని త్రివిక్రమ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్…
వార్ 2 మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమాను తెలుగులో సూర్యదేవర నాగవంశీ రిలీజ్ చేస్తున్నారు. ఇండియా వైడ్‌గా వార్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ ఆదివారం మొదలయ్యాయి. ఇప్పటివరకు 55 వేలకుపైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్ కారణంగా తొలిరోజు బాలీవుడ్ కంటే తెలుగులోనే ఈ సినిమా ఎక్కువగా కలెక్షన్స్ రాబట్టే అవకాశం కనిపిస్తోంది. వార్ 2 మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా కనిపించబోతున్నది.
Also Read – Motorola Edge 50 Ultra: ఫ్లిప్‌కార్ట్ ఇచ్చిపడేసింది..ఈ హై ఎండ్ మోటరోలా ఫోనెపై ఏకంగా రూ. ₹ 18000 డిస్కౌంట్!


